సంధ్య థియేటర్ ఘటన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణా ప్రభుత్వానికి గ్యాప్ క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో… తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు నష్ట నివారణా చర్యలకు దిగారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మధ్యవర్తిగా సీఎం రేవంత్ రెడ్డితో నేడు హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు ఊహించని షాక్ లు ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోలను అక్కడ ప్లే చేసి… జరిగిన వ్యవహారాన్ని చూపించారు.
Also Read : టార్గెట్ మహిళా ఎమ్మెల్యే.. కార్పోరేటర్లకు జగన్ ఆదేశాలు
అనంతరం మాట్లాడిన సీఎం… బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయం మారే ఛాన్స్ లేదని, అసెంబ్లీలో ప్రకటించిన నిర్ణయానికే కట్టుబడి ఉంటామని స్పష్టత ఇచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బెనిఫిట్ షోలు లేవని సినీ ప్రముఖులకు క్లియర్ కట్ గా చెప్పేశారు సీఎం. అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న సీఎం… బౌన్సర్ల విషయంలో ఇక నుంచి సీరియస్ గా ఉంటానని… అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలపై ఉందని స్పష్టత ఇచ్చారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేసారు.
Also Read : షమీ వెడ్స్ సానియా.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
అలాగే సినిమా వాళ్ళు కూడా తమకు సహకరించాలని కోరారు సీఎం. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని డ్రగ్స్ ప్రచారం విషయంలో… మహిళల భద్రతా ప్రచారం చేపట్టాలని కోరారు. అదే విధంగా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం మరియు ఎకో టూరిజంను ప్రోత్సహించాలని పెట్టుబడికి పరిశ్రమలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేసారు. టాలీవుడ్‌కు తాము వ్యతిరేకం కాదన్న సీఎం… టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి మేం ముందుంటామన్నారు. తెలంగాణలో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తిపై కమిటీ వేస్తామని పేర్కొన్నారు. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణా రైజింగ్‌లో ఇండస్ట్రీ సామాజిక బాధ్యతతో ఉండాలని సూచించారు సీఎం.




