Tuesday, October 28, 2025 02:25 AM
Tuesday, October 28, 2025 02:25 AM
roots

హైదరాబాద్ లో కుస్తీ తమిళనాడులో దోస్తీ

మాజీ మంత్రి కేటీఆర్ తమిళనాడు పర్యటన ఇప్పుడు సంచలనం అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేస్తున్న కేటీఆర్ తమిళనాడులో ప్రతిపక్ష పార్టీల మీటింగ్లో కూర్చోవడం ఆసక్తిని రేపుతోంది. ఎంపీ స్థానాలను తగ్గించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు పోరాటం చేస్తున్నాయి. ఎంపి స్థానాలు తగ్గిస్తే తమిళనాడుకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కేంద్రంపై గట్టిగానే పోరాడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో జనాభా ఎక్కువ.

Also read : మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ

విస్తీర్ణం పరంగా కూడా తమిళనాడు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెద్దది. గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరగకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాగా ఆ తర్వాత తమిళనాడు ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తమిళనాడు పెద్దదిగా అవతరించింది. ఇక ఇప్పుడు ఎంపీ స్థానాలు తగ్గిస్తే ఎక్కువగా నష్టపోయేది తమిళనాడు కావడంతో అక్కడి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి పోరాటం మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉంటే ఇక్కడ భారత రాష్ట్ర సమితి ఎందుకు వెళ్ళింది అనేది అర్థం కాని పరిస్థితి.

Also read : మహేష్-రాజమౌళీ ప్రాజెక్ట్ పై పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

డీలిమిటేషన్ కారణంగా తెలంగాణకు పెద్దగా నష్టం లేదనే భావన కూడా ఉంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఉన్న సమావేశానికి కేటీఆర్ హాజరు కావడం జనాలను ఆశ్చర్యపరిచింది. కేటీఆర్ ఇండియా కూటమికి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారనే భావన వినపడుతోంది. బిజెపికి దగ్గరవడం సాధ్యం కాకపోవడంతో కేటీఆర్ ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి కొంతమంది అయితే రేవంత్ రెడ్డి తో సఖ్యత కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బిజెపి కూడా భారత రాష్ట్ర సమితి పై గట్టి ఫోకస్ పెట్టింది. దీంతో జాతీయస్థాయిలో మద్దతు కోసం కాంగ్రెస్ కు దగ్గర కావాలని బి.ఆర్.ఎస్ ప్రయత్నిస్తున్నట్లుగానే అర్థమవుతుంది. దీనిపై ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. హైదరాబాదులో కుస్తీ పడుతూ తమిళనాడులో దోస్తీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్