Friday, September 12, 2025 07:28 PM
Friday, September 12, 2025 07:28 PM
roots

రెడ్ బుక్ ప్రభావం… వారంతా సర్దేశారు..!

వైసీపీకి ఏపీలో ఇప్పుడు అత్యంత గడ్డుకాలం నడుస్తుందనే చెప్పాలి. అసలే 11 సీట్లు మాత్రమే గెలవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. వై నాట్ 175 అన్న జగన్‌కు ఈ అంకె మింగుడుపడటం లేదు. దీంతో శాసనసభకు వెళ్లడానికి ముఖం చెల్లడం లేదు. అయితే ఓటమిని అంగీకరించలేక ఈవీఎం గోల్ మాల్ అంటూ కొంతకాలం గగ్గోలు పెట్టాడు. మరి బ్యాలెట్ విధానంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా అంటే… ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని తోక ముడిచారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌ను నిన్నటి వరకు దైవంగా భావించిన వాళ్లంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా సైడ్ అయిపోతున్నారు.

Also Read : ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి అరంగేట్రం

ఇదంతా అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జగన్ అండతో రెచ్చిపోయినందుకు ఫలితం అనుభవించాల్సి వస్తుందనే భయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతల చుట్టూ తిరిగిన సినీ నటుడు అలీ… సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. రాజ్యసభ సభ్యత్వమో లేక మండలిలో అవకాశమో వస్తుందని భావించిన అలీని చివరికి గౌరవ సలహాదారు పదవితో సరిపెట్టారు జగన్. అయితే ఐదేళ్లు జగన్ అండతో పవన్ కల్యాణ్‌ పైన పలు సందర్భాల్లో అలీ నోరు జారాడు కూడా. దీని వల్ల జగన్ తనకు పదవి ఇస్తాడని గంపెడంత ఆశపెట్టుకున్నాడు.

చివరికి రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం కూడా అలీ గట్టిగానే ప్రయత్నం చేశాడు. కానీ జగన్ మాత్రం నో చెప్పడంతో… అలీ సైలెంట్‌గా సైడ్ అయిపోయాడు. రాజకీయాలకు సెలవు అని చెప్పేశాడు. ఇక వైసీపీ హార్డ్‌కోర్ ఫ్యాన్ శ్రీరెడ్డి సంగతి సరే సరి. ఐదేళ్ల పాటు మా రెడ్డి.. మా జగనన్న అంటూ తెగ రెచ్చిపోయింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పైన నోటికి వచ్చినట్లుగా వాగేసింది. ఇష్టం వచ్చినట్లు బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. చివరికి ఎన్నికల ముందు కూడా గెలుస్తున్నాం… ఏం పీ….రో అంటూ వీడియో కూడా పెట్టింది. ఇక లోకేష్ పాదయాత్రలో రెడ్ బుక్ గురించి ప్రస్తావించినప్పుడు… రెడ్ బుక్‌ కాదు అది డెడ్ బుక్ అని కామెంట్ చేసింది.

Also Read :పారితోషికం లోనూ అన్ స్టాప‌బుల్ గ దూసుకెళ్తున్న బాలయ్య

అయితే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ముందు ఘాటుగా ఓ వీడియో పెట్టింది. వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్‌లకు పార్టీలో గుర్తింపు లేదంటూ బూతులు తిట్టింది. ఇక తనపై కేసులు పెడుతున్నారని తెలియడంతో కాళ్ల బేరానికి వచ్చింది. లోకేష్ అన్న అంటూ వీడియో చేసింది. నన్ను క్షమించూ అంటూ రెండు పేజీల లేఖాస్త్రం కూడా రాసింది. చివరికి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక తాజాగా పోసాని కృష్ణమురళీ కూడా రాజకీయాలకు దూరం అని ప్రకటించాడు. అయితే ఈ ప్రకటన వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరికీ భయపడనూ అంటూనే… రెడ్ బుక్‌కు భయపడుతున్నాడనే మాట వినిపిస్తోంది.

ఐదేళ్ల పాటు జగన్ మీద ఈగ కూడా వాలనివ్వకుండా అడ్డుపడిన పోసాని.. ఇప్పుడు తనను కూడా లోపలేస్తారనే భయంతో… నేను రాజకీయాలకు గుడ్ బై.. ఇకపై రాజకీయాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయను… ప్రామిస్… నన్ను నమ్మండి అంటూ కొత్త పాట పాడుతున్నారు. ఇది కూడా రెడ్ బుక్ ప్రభావమే అనే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మొత్తానికి రెడ్ బుక్ ప్రభావంతో కొంతమంది నేతలు రాజకీయాలకే శాశ్వతంగా దూరం అంటూ ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్