తెలుగుదేశం పార్టీ గేట్లు మూసింది కాబట్టి జనసేన పార్టీ గేట్లు తెరిచింది. అది ఒక వ్యూహం… ఆ వ్యూహం బాగుంది… అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే వైసీపీ ఖాళీ అవుతుంది. అదంతా బాగుంది, కానీ దానితో వచ్చే సమస్యలు ఇప్పుడు అన్నీ ఇన్నీ కాదు. ఉదాహరణకు జగ్గయ్యపేట నియోజకవర్గం తీసుకుందాం. జగ్గయ్యపేట నుంచి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను జనసేనలో జాయిన్ అయ్యారు. ఇక్కడి నుంచే గ్రామాల్లో వైసీపీ నాయకుల పెత్తనం మొదలయింది. టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు.
జనసేనలో చేరి వారం కూడా కాలేదు. అప్పుడే గ్రామాల్లో తాజా మాజీ వైసీపీ నేతల పెత్తనం మొదలయింది. కొత్తగా జనసేనలోకి వచ్చి… గ్రామాల్లో ఆర్డర్లు వేయడం, ఉదయ భాను పేరు చెప్పి తమ స్వభావాన్ని బయటపెట్టడం చేస్తున్నారు. పంచాయితీ ఆఫీసుల్లో కూడా తమ పెత్తనం చేలాయిస్తున్నారు. ఇక ఇసుక అక్రమాలు గతంలో చేసారు.. ఇప్పుడు కూడా మళ్ళీ మొదలుపెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. టీడీపీ నేతల వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు, ఉదయభాను అండ చూసుకుని పొత్తులో ఉన్నాం మాకు ఇవి కావాల్సిందే అని నామినేటెడ్ పదవులను కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టారు.
Read Also : ఎన్ సిఏ పేస్ గన్ రెడీ అవుతుందా…? టార్గెట్ ఆస్ట్రేలియా…!
అలాగే గ్రామాల్లో చిన్న చిన్న కాంట్రాక్ట్ లు చేసుకునే టీడీపీ కార్యకర్తలను కూడా తమకు కూడా భాగస్వామ్యం కావాలి అంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇది కేవలం జగ్గయ్యపేటలో మాత్రమే ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉండి ఉండవచ్చు. డ్రైనేజి కాంట్రాక్ట్ లు, రోడ్ కాంట్రాక్ట్ లు ఇలా అన్నిటిలో వాటాలు అడగడం మొదలుపెట్టారు. ఇది క్రమంగా పార్టీని దెబ్బ తీసినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. మొన్నటి వరకు వాళ్ళ పెత్తనమే నడిచి.. ఇప్పుడు కూడా వాళ్ళ పెత్తనమే నడిస్తే మా పరిస్థితి ఏంటీ అంటూ టీడీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో, ఇది తీవ్ర రూపం దాలిస్తే పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది.