Friday, September 12, 2025 02:26 AM
Friday, September 12, 2025 02:26 AM
roots

టీడీపీ బాటలోనే జగన్..!

నేను మోనార్కును.. అనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దగ్గరగా చూసిన వాళ్లు చెప్పే మాట. జగన్ తీరు మొదటి నుంచి అంతే. తాను చెప్పిందే వేదం… చేసిందే చట్టం.. అని జగన్ చెప్తారనేది సన్నిహితుల మాట. ఆయన మాట వినలేదనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను తీసేశారనేది సచివాలయంలో బంట్రోతు మొదలు.. అత్యున్నత స్థాయి పదువులు అనుభవించే వారి వరకు తెలుసు. అందుకే.. ఎవరైనా సరే.. జగన్ క్యాబిన్‌కు వెళితే.. ఎదురు ప్రశ్నించడం.. మారు మాట్లాడటం జరగదు. అది మంత్రివర్గ సమావేశం అయినా.. కలెకర్ల రివ్యూ అయినా.. ప్రెస్ మీట్ అయినా సరే.. పెట్టింది తిని… చెప్పింది రాసుకుని బయటకు రావాల్సిందే. అందుకే తనను ఎవరూ ప్రశ్నించకూడదు అని జగన్ హుకుం జారీ చేయడంతో.. ముఖ్యమంత్రి అధికారికంగా నిర్వహించే మీడియా సమావేశాలకు కూడా కేవలం సెలక్టెడ్ రిపోర్టర్లను మాత్రమే అనుమతిస్తారు. వచ్చిన వాళ్లు ఎవరైనా ప్రశ్న వేస్తే… లంచ్ బ్రేక్.. ప్లీజ్.. అని ఓ సైగ చేసి వెళ్లిపోతారు తప్ప.. జవాబు చెప్పేదే లేదంటారు. అందుకే పొలిటికల్ సర్కిల్‌లో అంతా జగన్‌ను నియంత అంటారు.

Also Read : చిన్న వయసులో గుండెపోటు.. హైదరాబాద్ లో విషాదం

2009 ఎన్నికల్లో తొలిసారి తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కడప పార్లమెంట్ ఎంపీగా గెలిచారు జగన్ మోహన్ రెడ్డి. ఆ తర్వాత నుంచి ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల అండతోనే సీఎం కుర్చీ ఎక్కారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కుటుంబ సభ్యుల అండతోనే వైసీపీ ప్రారంభించారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి కుటుంబ సభ్యులే అండగా ఉన్నారు. తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల పార్టీ కార్యక్రమాలు చూసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల ఏకంగా 3 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు కూడా. ఇక 2014 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ నుంచి వైఎస్ విజయలక్ష్మి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు కూడా. ఆ తర్వాత పార్టీ నిర్వహించిన ప్రతి రాజకీయ వేదికపై కూడా ఓ వైపు తల్లికి, మరో వైపు చెల్లికి ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేశారు. జగన్.

Also Read : దేశాధినేతను లేపేస్తాం.. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ద మేఘాలు

2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి జిల్లాలో కుటుంబ సభ్యులంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పరామర్శించారు. 2019 ఎన్నికల్లో అయితే కాలుకు బలపం కట్టుకుని మరీ తిరిగారు. జగన్ గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించారు. బై బై బాబు అంటూ షర్మిల చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది కూడా. వైసీపీ గెలిచిన తర్వాత తల్లి, చెల్లితో కలిసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు జగన్. ఆ తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. రాజకీయంగా జగన్‌కు అండగా ఉన్న తల్లి, చెల్లి దూరమయ్యారు. పైగా జగన్ పైనే షర్మిల విమర్శలు చేశారు. తల్లి విజయలక్ష్మి కూడా తన మద్దతు జగన్‌కు లేదని పరోక్షంగా చెప్పేశారు. మరో వైపు సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత కూడా టార్గెట్ జగన్ అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో తనకు కుటుంబం అండ లేదని జగన్ తెలుసుకున్నారు. నా వల్లే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని భావించిన జగన్‌కు 2024 ఎన్నిక ఫలితం షాక్ ఇచ్చింది. అటు కుటుంబ సభ్యులు దూరమవ్వడం.. ఇటు అధికారం కోల్పోవడంతో.. తనకు అండగా ఎవరున్నారా అనే వేటలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : ఆపరేషన్ మహాదేవ్.. పహల్గాం దాడి మాస్టర్ మైండ్ హతం..?

ఏ రాజకీయ పార్టీకి అయినా కార్యకర్తలే బలం. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి అండగా నిలిచింది కార్యకర్తలే. అందుకే పార్టీ స్థాపించినప్పుడే సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అనే స్లోగన్‌తోనే ఎన్నికలకు వెళ్లారు నందమూరి తారక రామారావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మాటను టీడీపీ అనుసరిస్తోంది. కార్యకర్తకు చిన్న ఇబ్బంది వచ్చినా సరే.. అధినేత చంద్రబాబు స్వయంగా స్పందిస్తారు. కానీ జగన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ముద్దులు, సెల్ఫీలు, భుజం మీద చేతులతో దగ్గరకు తీసుకున్నారు. కానీ గెలిచిన తర్వాత నుంచి పరదాల మాటునే నడిచారు. తాడేపల్లి ప్యాలెస్‌లోకి సామాన్యులకు కాదు కదా.. ఎమ్మెల్యేలు, మంత్రులకే అనుమతి లేదు. దీంతో జగన్ తీరుపై పార్టీ నేతలే విమర్శలు చేశారు. వైసీపీలో ఉన్న నేతలు, కార్యకర్తల్లో చాలా మంది వైఎస్ఆర్ అభిమానులే. తండ్రి పేరు చెప్పే జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన ఫోటో తీసేసి.. అన్ని పధకాలకు తన పేరు పెట్టుకున్నారు కూడా.

Also Read : పోటీ చేస్తున్నాం.. టీటీడీపీ కీలక ప్రకటన 

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అసలు విషయం తెలిసినట్లుంది. అందుకే మళ్లీ కార్యకర్తలను తెరమీదకు తీసుకువస్తున్నారు జగన్. 2019 ఎన్నికల్లో జగన్‌ గెలుపు కోసం కష్టపడిన వాళ్లనే ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారు. కార్యకర్తల చేత.. కార్యకర్తల కోసం.. కార్యకర్తల వల్ల అంటూ కొత్త పాట పాడేందుకు జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాయకుల కంటే కూడా కార్యకర్తలతే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం వైసీపీని నాయకుల కొరత తీవ్రంగా కలవరపెడుతోంది. జగన్ సన్నిహితులని భావించిన వారే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఉన్న వాళ్లు కూడా కేసుల భయంతో బయటకు రావడం లేదు. చివరికి పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు కూడా నేతలు ముఖం చాటేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పుంజుకోవాలంటే.. అది కార్యకర్తల వల్లే సాధ్యమనేది జగన్ నమ్మకం. అందుకే ఇటీవల జరిగిన నియోజకవర్గాల రివ్యూ మీటింగ్లో కూడా పదే పదే కార్యకర్తల గురించి జగన్ ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా కార్యకర్తలపైనే పూర్తిగా ఆధారపడాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీని వీడిన నేతలను తిరిగి చేర్చుకునేందుకు కూడా జగన్ రెడీ అంటున్నట్లు తెలుస్తోంది. మరి జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. లేదో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్