Wednesday, February 4, 2026 07:42 AM
Wednesday, February 4, 2026 07:42 AM

జోగి వెనుక ఉన్నది ఎవరు.. అంత ధైర్యం ఏమిటీ..?

వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఇంకా బుద్ది రాలేదా.. ఇప్పుడు ఇదే ప్రశ్న బాగా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి రావాలంటే జగన్‌ను మెప్పించాలనే ఏకైక లక్ష్యంతో నాటి ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు ఇంటి పైన దాడికి యత్నించారు. వెయ్యి మంది గూండాలతో వందల కార్లు వేసుకుని ఇంటి పై దాడి చేసేందుకు జోగి ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను తోసుకుంటూ వెళ్లారు. జోగి చేసిన రచ్చకు మెచ్చిన వైఎస్ జగన్.. ఆయనను మంత్రిని చేసి తన పక్కనే కూర్చొబెట్టారు. దీంతో మరింత రెచ్చిపోయిన జోగి.. ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ బహిరంగ సమావేశాల్లో, ప్రెస్ మీట్‌లలో అనే తేడా లేకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో జోగి.. నువ్వు సూపర్ అంటూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెన్నుతట్టి మరీ ప్రోత్సహించారు.

Also Read : అప్పుడు అత్యాశ పడ్డారు.. ఇప్పుడు బోల్తా పడ్డారు..!

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జోగి రమేశ్ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. అగ్రిగోల్డ్ భూములను బలవంతంగా, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో జోగి రమేశ్ కుమారుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో వెంటనే కులం కార్డు తీశారు. ఒక బీసీ నేతపై దాడి అని కులం ప్రస్తావన తీసుకువచ్చారు. నిజానికి చంద్రబాబుపైన, పవన్ కల్యాణ్‌పైన కులం పేరుతో దూషణలు చేసిన వారిలో జోగి అగ్రస్థానంలో ఉన్నారు. కులం పేరు ముందు పెట్టి.. ఆ తర్వాత నా కొ.. లు అంటూ ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడిన ఘన చరిత్ర జోగి సొంతం. అవేవీ వైసీపీ నేతలకు తప్పుగా అనిపించలేదు కానీ.. అవినీతి కేసులో జోగి కుమారుడు అరెస్టు అనగానే.. కులం కార్డు తీశారు.

ఇక కూటమి సర్కార్‌ను గబ్బు చేయాలనే ఏకైక లక్ష్యంతో కల్తీ మద్యం తయారీ అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు జోగి రమేశ్. అయితే ఈ రాకెట్ వెనుక ఉన్నది జోగి బ్రదర్స్ అని తెలుసుకునేందుకు అధికారులకు ఎంతో సమయం పట్టలేదు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. జోగి సోదరులను అరెస్టు చేశారు. 83 రోజుల తర్వాత జోగి బ్రదర్స్ జైలు నుంచి బెయిల్‌పైన విడుదలయ్యారు. కేసులు పెడితే వైసీపీ నేతలు భయపడతారా అంటూ బెయిల్ పై విడుదలైన వెంటనే అదే దూకుడు ప్రదర్శించారు. ఇక కల్తీ లడ్డు వ్యవహారంలో వైసీపీ పిలుపునిచ్చిన ఆలయాల్లో ప్రత్యేక పూజలంటూ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో మరోసారి జోగి నోరు పారేసుకున్నారు. లోకేష్‌పై మళ్లీ అదే అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొవ్వు, బలుపు అంటూ నోటికి ఎంత మాట పడితే అంత మాట అన్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. జోగి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టారు.

Also Read : కేంద్ర బడ్జెట్‌ ప్రభావం: మార్కెట్లకు ముప్పేనా?

అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. జోగి రమేశ్ దూకుడుకు కారణం ఏమిటనే ప్రశ్న. ఇంత జరుగుతున్నా కూడా.. జోగి ఎందుకు పదే పదే అదే తరహాలో చంద్రబాబు, లోకేష్‌పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనేది రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలు జోగి వెనుక ఉన్నది ఎవరనే ప్రశ్న కూడా బాగా వినిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారయణ అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతల తీరు పట్ల ఇటీవల మంత్రి నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంకా చెప్పాలంటే.. అసలు మీరంతా ఏం చేస్తున్నారు.. ఎందుకున్నారు.. అనే ప్రశ్నలను లోకేష్ పార్టీలో సీనియర్ నేతలను వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. కూటమి ప్రభుత్వంపైన మరీ ముఖ్యంగా చంద్రబాబుపైన వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు. వాటిని తిప్పికొట్టడంలో టీడీపీ సీనియర్లు ఉదాసీనంగా ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది.

జోగి రమేశ్ అరెస్టు సమయంలో కులం కార్డు తీసి కులాల కుంపట్లు రాజేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే.. జోగి సామాజిక వర్గానికి చెందిన నేతలు కనీసం స్పందించటం లేదు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నది మాజీ ఎంపీ, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి జోగి కుటుంబంతో కొనకళ్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే అధినేతపైన జోగి విమర్శలు చేస్తుంటే.. కొనకళ్ల సైలెంట్‌గా ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. గతేడాది కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా జోగి రమేష్‌ను ఘనంగా సన్మానించిన వారిలో కొనకళ్ల సోదరులు కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు కూడా గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగిని ప్రత్యేకంగా సన్మానించారు కొనకళ్ల. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం రేపింది కూడా.

Also Read : ఆ ఆటగాడికి ఎందుకీ అన్యాయం..?

నిజానికి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జోగి రమేష్‌తో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన ఆరేపల్లి రాంబాబు, అనగాని రవి, బెజవాడ హర్ష కూడా పాల్గొన్నారు. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. వాళ్ల ఎందుకు వచ్చారో తెలియదని బుకాయించారు కూడా. అయితే ఈ కార్యక్రమానికి ముందు నూజివీడులోని ఓ వైసీపీ నేత ఇంట్లో కొనకళ్ల బ్రదర్స్ సమావేశమయ్యారని.. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ కూడా అప్పుడే కొందరు స్థానిక టీడీపీ నేతలు చంద్రబాబుకు అందించారు. దీంతో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. కొనకళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.

పద్దతి మార్చుకోవాలని అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా హెచ్చరించినప్పటికీ.. కొనకళ్ల బ్రదర్స్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు అనేది ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలు చెబుతున్న మాట. అందుకే ఇటీవల జిల్లా పార్టీ అధ్యక్షుని ఎంపికలో కొనకళ్ల సూచనలను అధినేత చంద్రబాబు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అయినా సరే.. కొనకళ్ల, జోగి మధ్య బంధం అలాగే కొనసాగుతుందని.. అందుకే జోగి రమేశ్ జైలు నుంచి బయటకు వచ్చినా కూడా.. లోకేష్‌పైన అదే తరహాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఇప్పటికైనా జోగికి అండగా ఉన్న వారిపై చర్యలు తీసుకోకపోతే.. భవిష్యత్తులో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్