ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే అనారోగ్యానికి గురి కావడం లేదంటే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం మనం పదే పదే చూస్తున్నాం. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు ఇలా చాలా మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు చూసాం. ఇటీవల బాలీవుడ్ నటి, షెఫాలి జరివాలా ఆకస్మిక మరణం ఆశ్చర్యపరిచింది. 42 ఏళ్ల నటి, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో దీని గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. ఇప్పుడు ఆమె మరణానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
Also Read : అధినేతపై గోరంట్ల తిరుగుబాటు..!
తక్కువ వయస్సులా కనపడే యాంటీ-ఏజింగ్ చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణం చేతనే ఆమె ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మందులతో ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆమెకు ముందు నుంచి మూర్చ వ్యాధి ఉండటం, ఆ వ్యాధికి మందులు తీసుకుంటూనే వయసు కనపడకుండా ఉండేందుకు మందులు తీసుకోవడం ఆమె ఆరోగ్యంపై ప్రభావం పడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : మిడిల్ క్లాస్ కు కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గే ధరలు ఇవే
స్కిన్ ట్రీట్మెంట్ లో గ్లూటాతియోన్ మరియు విటమిన్ సి ఎక్కువగా వినియోగిస్తున్నారు. డీహైడ్రేటెడ్ లేదా ఉపవాసం ఉన్న సమయంలో ఈ మందులు తీసుకుంటే అది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందట. ఈ మందులే ఆమె ప్రాణం తీసుకున్నట్టు భావిస్తున్నారు. బ్లడ్ ప్రెజర్ లో మార్పులు తీసుకు రావడంతో అది గుండెపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ డిఏ) గ్లూటాతియోన్ ను ఆమోదించలేదు. చాలా మంది హీరోయిన్లు ఈ మందులు వాడుతున్నారు అనేది నిపుణుల ఆరోపణ.