వైయస్ జగన్ ను అభిమానించే వైసిపి కార్యకర్తలు.. గత ఐదేళ్ల కాలంలో ఏ విధంగా రెచ్చిపోయారో చూసాం. మహిళలు, చిన్నారులు.. లేదంటే పెద్దపెద్ద పదవుల్లో ఉన్నవాళ్లు అనే తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్లను, ఏది పడితే అది తిట్టడం గమనించాం. అయితే ఇప్పుడు మాత్రం వైసిపి సోషల్ మీడియా దాదాపుగా సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో రెచ్చిపోతున్న వాళ్ళ పై కేసులు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టడంతో కార్యకర్తలు ఇప్పుడు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు.
Also Read: ర్యాంకులతో కూటమికి కొత్త తలనొప్పులు..!
తాజాగా వైయస్ షర్మిల.. జగన్ టార్గెట్ గా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్.. తన కూతురు, కొడుకు ఆస్తి జగన్, భారతి లాక్కునే ప్రయత్నం చేశారని.. విజయసాయిరెడ్డి తో తనను బూతులు తిట్టించారని షర్మిల ఆరోపించారు. సాధారణంగా షర్మిల చేసిన వ్యాఖ్యల తీవ్రతకు.. వైసిపి క్యాడర్ గట్టిగానే రియాక్ట్ అవ్వాలి. వైసిపి నాయకత్వం కూడా ఈ విషయంలో గట్టిగానే కౌంటర్లు కూడా ఇవ్వాలి. కానీ వైసీపీ క్యాడర్ గాని, నాయకత్వం గానీ ఎక్కడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ఒకప్పుడు రెచ్చిపోయి షర్మిలను నానా మాటలు అన్న వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు.
Also Read: విలువలు, విశ్వసనీయత.. ట్వీట్ వార్..!
అభ్యంతరకర వ్యాఖ్యలు పక్కన పెడితే కనీసం ఆమెకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయ అంశంగా మారిపోయింది. కుటుంబ విషయాలను కూడా రాజకీయ నాయకులతో మాట్లాడించే వైయస్ జగన్ ఇప్పుడు మాత్రం ఎవరితోనూ మాట్లాడించే ప్రయత్నం చేయడం లేదు. విజయసాయిరెడ్డి వ్యవహారంలో కూడా వైసిపి నాయకత్వం గానీ, సోషల్ మీడియా గానీ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. టిడిపి నేతలు లేదంటే జనసేన నేతలను తిట్టడానికి మాత్రం భయపడే వైసిపి క్యాడర్.. షర్మిలను కూడా తిట్టే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు.