దేశంలో యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, అదే స్థాయిలో జరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఒక సంచలన ప్రతిపాదన చేసింది. రూ. 10,000 అంతకంటే ఎక్కువ విలువైన డిజిటల్ లావాదేవీల విషయంలో నిరీక్షణ సమయం విధించాలని భావిస్తోంది. రూ.10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఎవరికైనా పంపినప్పుడు, ఆ లావాదేవీ పూర్తి కావడానికి ఒక గంట సమయం పట్టేలా కొత్త నిబంధనను తీసుకురాబోతున్నారు.
Also Read :ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఏపీ సర్కార్..!
ఈ గంట సమయంలో వినియోగదారులు తాము చేసిన లావాదేవీని మరోసారి తనిఖీ చేసుకోవచ్చు. పొరపాటున ఎవరికైనా పంపినా లేదా మోసగాళ్ల బారిన పడినా, ఆ గంటలోపు లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఎవరికి మినహాయింపు ఉంటుంది అంటే.. ఈ నిబంధన కేవలం వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. మర్చంట్ పేమెంట్స్ అంటే దుకాణాల్లో చెల్లింపులు, సబ్స్క్రిప్షన్లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, లోన్ ఈఎంఐల చెల్లింపులకు ఈ గంట ఆలస్యం నిబంధన ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు క్రేజీ న్యూస్..!
ఈ నిర్ణయం వెనుక బలమైన కారణం ఉంది. చాలామంది అమాయకులు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ లేదా లింక్స్ నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు పంపి మోసపోతున్నారు. దీనిపై ఇప్పటికే అనేక రూపాల్లో ప్రచారం చేస్తున్నా లాభం శూన్యం. ఒక్కసారి డబ్బు డెబిట్ అయ్యాక దాన్ని తిరిగి రాబట్టడం కష్టంగా మారింది. ఈ గంట విరామం వల్ల బాధితులకు తమ డబ్బును కాపాడుకునే అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉంది. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి మార్గదర్శకాలను ఆర్బీఐ విడుదల చేసే అవకాశం ఉంది.

