భారత క్రికెట్ లో జరుగుతున్న మార్పులు రోజురోజుకీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో జట్టులో రాజకీయాలు ఎక్కువయ్యాయి అనే విమర్శలు నేపథ్యంలో బోర్డు నష్ట నివారణ చర్యలకు దిగింది. ముఖ్యంగా సెలక్షన్ కమిటీ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో బోర్డు కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తోంది. ఈమధ్య కొంతమంది ఆటగాళ్లను జట్టు మంచి తప్పించడంపై అభిమానుల నుంచి అలాగే మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. సెలక్షన్ కమిటీ అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. కొందరు ఆటగాళ్లపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వచ్చాయి.
Also Read : బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంచలన మార్పులు..!
ఈ నేపద్యంలో సెలక్షన్ కమిటీ నుంచి ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ను తప్పించాలని భావిస్తున్నారు. ఆ స్థానంలో టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి చీఫ్ సెలెక్టర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం కనబడుతోంది. దీని వెనక పలు కీలక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ జట్టు నుంచి తప్పుకోవడం పై విమర్శలు వచ్చాయి. కేవలం సెలక్షన్ కమిటీ కారణంగానే వాళ్లు టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక షమీ లాంటి బౌలర్ ను జట్టు నుంచి తప్పించడాన్నీ మాజీ ఆటగాళ్లు తప్పుపడుతున్నారు.
Also Read : ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్..? బయటకు రాని టీటీడీపీ నాయకులు
2027 ప్రపంచ కప్ ప్లానింగ్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను తప్పించాలి అని భావిస్తున్నట్లు కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. అటు సీనియర్ ఆటగాళ్లు కూడా సెలక్షన్ కమిటీ విషయంలో సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దీనితోనే ఇప్పుడు కీలక మార్పులకు దిగుతుంది బోర్డు. రవి శాస్త్రి దాదాపుగా ఖరారు అయిపోయినట్లు సమాచారం. రాబోయే ఒకటి రెండు వారాల్లో సెలక్షన్ కమిటీలో మార్పులు ఉండే అవకాశం ఉంది. మొత్తం కమిటీ మొత్తాన్ని మార్చాలని భావిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. గతంలో హెడ్ కోచ్ గా పని చేసిన సమయంలో రవి శాస్త్రి టీం ను సమర్ధవంతంగా ముందుకు నడిపించాడు.