ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం నేడు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక మంత్రుల పనితీరుపై క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. డిసెంబర్ వరకు ఫైల్స్ క్లియర్ చేసిన మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు స్వయంగా చదివి వినిపించారు. ఆరవ స్థానంలో తాను ఉన్నానని చెప్పిన చంద్రబాబు… ఫైల్స్ వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు.
Also Read : వివేకా కేసులో కీలక అడుగు.. ఇప్పుడైనా అరెస్ట్ అవుతారా…?
ఫైల్స్ క్లియరెన్స్ లో మొదటి స్థానంలో ఎండి ఫరూక్ ఉండగా చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. క్లియరెన్స్ పై ముఖ్యమంత్రి చదివి వినిపించిన వివరాలు ఒకసారి చూస్తే.. 1. ఫరూఖ్, 2. కందుల దుర్గేష్, 3.కొండపల్లి శ్రీనివాస్, 4. నాదెండ్ల మనోహర్, 5. డోలా బాలవీరాంజనేయ స్వామి, 6. చంద్రబాబు, 7. సత్యకుమార్ యాదవ్, 8. నారా లోకేష్, 9. బీసీ జనార్థన్ రెడ్డి, 10. పవన్ కళ్యాణ్, 11. సవిత, 12. కొల్లు రవీంద్ర, 13. గొట్టిపాటి రవికుమార్, 14. నారాయణ, 15. టీజీ భరత్, 16. ఆనం రాం నారాయణరెడ్డి, 17. అచ్చెన్నాయుడు, 18. రాంప్రసాద్ రెడ్డి, 19. గుమ్మడి సంధ్యారాణి, 20. వంగలపూడి అనిత, 21. అనగాని సత్యప్రసాద్, 22. నిమ్మల రామానాయుడు, 23. కొలుసు పార్థసారధి, 24. పయ్యావుల కేశవ్, 25. వాసంశెట్టి సుభాష్.
Also Read : ఎమ్మెల్యే గారి వైసీపీ ప్రేమ.. కృష్ణా జిల్లాలో అలజడి..!
వీరిలో ముఖ్యంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను కేబినేట్ నుంచి తొలగిస్తారని ప్రచారం జరిగింది. అయితే తన పని తీరుతో మంత్రి సమాధానం చెప్పడం గమనార్హం. స్వయంగా చంద్రబాబు మంత్రిని పిలిచి అభినందించారు. ఇక కొత్త మంత్రులు నేర్చుకునేందుకు ప్రయత్నం చేయాలని, శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారు. కేబినేట్ సమావేశంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పని తీరుపై స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రశంశలు కురిపించారు. ఇంకా బాగా చేయాలని సూచించారు. ముగ్గురు మంత్రులు కొత్త వారైనా సరే సమర్ధవంతంగా పని చేస్తున్నారని అభినందించారు. సచివాలయంలో అందుబాటులో ఉండేందుకు ప్రయత్నించాలని ఇదే సమయంలో నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనిమంత్రులకు దిశా నిర్దేశం చేసారు చంద్రబాబు.




