Saturday, October 25, 2025 07:49 PM
Saturday, October 25, 2025 07:49 PM
roots

మంత్రులకు ర్యాంకులు కరెక్టేనా..? వద్దంటున్న కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ర్యాంకింగ్ ఇస్తున్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఫైల్స్ క్లియర్ చేసే విషయంలో మంత్రులకు చంద్రబాబు నాయుడు ర్యాంకులు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ర్యాంకులు ప్రకటిస్తున్నారు. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. రాజకీయ పరిశీలకులు ఇది కరెక్ట్ కాదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మంత్రుల సమర్థతను చాలామంది ఈ ర్యాంకులు ఆధారంగా చూస్తున్నారని.. ఇది ఒక రకంగా సమర్థవంతంగా పనిచేసే వారికి అవమానకరంగా ఉంటుందని వాదిస్తున్నారు.

Also Read : బన్నీ విత్ అట్లి.. స్టోరీ ఇదేనా..?

ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటుగా కొంతమంది కీలక మంత్రుల ర్యాంకులు వెనకబడి ఉన్నాయి. పయ్యావుల కేశవ్ రెండుసార్లు చివరి స్థానంలోనే ఉన్నారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఫైల్స్ క్లియర్ చేయాలి అంటే దానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అనేది విశ్లేషకుల మాట. దానికి తోడు ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితికి కేశవ్.. దూకుడుగా పని చేయలేని పరిస్థితి. ఇక మిగిలిన వ్యవసాయ శాఖతోపాటుగా అటవీ శాఖ కూడా క్లిష్టమైనవే. రెవెన్యూ శాఖలో కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈ శాఖలలో ఫైల్స్ క్లియర్ చేయడం ఎక్కువ సమయం తీసుకుంటుంది.

Also Read : ఉద్యోగులకు డ్రీమ్ 11 షాక్..!

ప్రజా జీవితంలో సమర్థవంతమైన నాయకులుగా పేరు తెచ్చుకున్న వారు.. ఇలా ర్యాంకులు ప్రకటించి వెనుకబడ్డారు అని చెప్తే అది వారికి అవమానకరంగా ఉంటుందని, అలాగే పార్టీ కార్యకర్తల్లో కూడా వారిపై అభిప్రాయాలు మారే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ర్యాంకులు పేరుతో బాగా పనిచేసే మంత్రులను చంద్రబాబు ప్రోత్సహించడంలో తప్పు లేదని.. కానీ ర్యాంకులు ఆధారంగా ఇతర మంత్రులను అవమానించడం కూడా భావ్యం కాదని వాదిస్తున్నారు. దీనిపై ఒకరిద్దరు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఫైల్స్ క్లియర్ చేసే అంశంలో కాకుండా ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకుని మంత్రులకు ర్యాంకులు ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేలకు కూడా ర్యాంకులు ఇస్తే బాగుంటుందని ప్రజల్లోకి వెళ్లి పని చేసే వారిని ర్యాంకులతో ప్రోత్సహించడంలో తప్పులేదని కానీ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు కారణంగా ర్యాంకులు ఇస్తే బాగా పనిచేసే వారు కూడా వెనుకబడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్