పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ ఏ స్థాయిలో కఠినంగా వ్యవహరిస్తుందో చూపించింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ భూభాగంలో దాదాపు 300 కిలోమీటర్ల వరకు వెళ్లి దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలను, వారికి శిక్షణ ఇచ్చే కేంద్రాలను, కొందరు కీలక ఉగ్రవాదులను భారత ఆర్మీ నాశనం చేసింది. ఆ సమయంలో పాక్ అదే స్థాయిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినా సరే పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తున్నప్పటికీ.. పాక్ మాత్రం కవ్విస్తూనే ఉంది.
Also Read : ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.. ఆస్ట్రేలియాకు లోకేష్ పయనం
ఈ నేపధ్యంలో భారత రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ దేశానికి, సైన్యానికి ఇతర దేశాలను కవ్వించడం ఒక అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ వార్నింగ్ ఇచ్చారు. లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ సెంటర్ లో తయారు చేసిన మొదటి బ్రహ్మోస్ క్షిపణులను ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్.. బ్రహ్మోస్ పరిధిలో ఉందని, పాకిస్తాన్ ఆటలు సాగవు అంటూ హెచ్చరించారు రాజనాథ్.
Also Read : ఏపీ ఎఫెక్ట్.. రంగంలోకి ట్రబుల్ షూటర్..!
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశ భద్రతకు బ్రహ్మోస్ ఎంత కీలకమో నిరూపించిందని అన్నారు. గెలవడం ఒక సంఘటన కాదని, అది మనకు అలవాటుగా మారింది అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఒక ట్రైలర్ మాత్రమే అని, తాము ఇంకా ఏం చేయగలమో.. ఆపరేషన్ సిందూర్ లోనే చూపించామని అన్నారు. ఇక బ్రహ్మోస్ తయారి కేంద్రం గురించి మాట్లాడుతూ.. ఇక్కడ ఏటా.. 100 క్షిపణులను తయారు చేసి, సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళానికి సరఫరా చేసే సామర్ధ్యం ఉన్న కేంద్రమని తెలిపారు.