2027 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ ఆడతాడా, లేదా అనే దానిపై ఎన్నో ప్రశ్నలు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ విషయంలో ఏమి ఆలోచిస్తుందనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇటీవల బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ఆడతాడు అని ప్రకటించారు. కానీ జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం వచ్చే వరల్డ్ కప్ లో కోహ్లీ ఆడాలి అంటే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్లో పాల్గొనాల్సి ఉంటుంది. విజయ్ హజారే ట్రోఫీలో అతను ఆడాలనే కండిషన్ బోర్డు పెద్దలు పెట్టినట్లు సమాచారం.
Also Read : అతను మరో సెహ్వాగ్.. భారత ఓపెనర్ పై ఆసిస్ దిగ్గజం ప్రసంశలు
ఇటీవల బోర్డుకి చెందిన ఓ కీలక వ్యక్తి విరాట్ కోహ్లీతో సంప్రదింపులు జరిపి ఈ విషయంలో స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కోహ్లీ వయసు కారణంగా అతన్ని పక్కన పెట్టే ఆలోచనలో బోర్డు పెద్దలు ఉన్నారనే మరో ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు 36 ఏళ్ళు. వచ్చే వరల్డ్ కప్ నాటికి అతనికి 38 ఏళ్ళు వస్తాయి. అప్పటికి అతను ఫిట్నెస్ కాపాడుకోవడం కష్టమని బోర్డు పెద్దలు భావిస్తున్నారట. అయితే ఇక్కడ అభిమానుల నుంచి మరో ప్రశ్న బోర్డుకు ఎదురవుతోంది.
2011 ప్రపంచ కప్ ఆడే సమయానికి సచిన్ వయసు 38 ఏళ్ళు. మరి సచిన్ ఆడగాలేనిది అంత ఫిట్నెస్ ఉన్న కోహ్లీ ఎందుకు ఆడలేడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సచిన్ దాదాపుగా 40 ఏళ్లు వచ్చేవరకు క్రికెట్ ఆడాడు. సచిన్ విషయంలో మీడియా కూడా ఎప్పుడూ హడావుడి చేసినట్లు కనపడలేదు. అక్కడక్కడ విమర్శలు వచ్చినా సరే కోహ్లీ మాదిరిగా టార్గెట్ చేయలేదు. కోహ్లీ ఆడాలని అభిమానులు కోరుకుంటునే ఉన్నారు. టెస్ట్ క్రికెట్లో కూడా కొనసాగాలని అభిమానులు కోరారు. కానీ కోహ్లీ మాత్రం వన్డేలకు పరిమితమయ్యాడు.
Also Read : బ్లూ మీడియాగా న్యూట్రల్ మీడియా.. గతం మరిచిందా..?
ఇలాంటి సమయంలో బోర్డు పెద్దలు పెడుతున్న కండిషన్స్ అభిమానులకు చిరాకుగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కోహ్లీ మంచి ప్రదర్శన చేశాడు. అలాంటి కోహ్లీని తప్పించడానికి బోర్డు పెద్దలు సాహసం చేయడం కరెక్ట్ కాదనేది అభిమానుల వాదన. అయితే హెడ్ కోచ్ గంభీర్ కారణంగానే విరాట్ కోహ్లీని పక్కన పెడుతున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం అక్టోబర్ లో ఆస్ట్రేలియా పర్యటనే విరాట్ కోహ్లీకి ఆఖరిది అంటున్నాయి క్రికెట్ వర్గాలు.