Tuesday, October 28, 2025 02:25 AM
Tuesday, October 28, 2025 02:25 AM
roots

టైటిల్ ప్లాన్ మారింది.. జక్కన్న ప్లానింగ్ వేరే లెవెల్

రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాపై ఏ అప్డేట్ వచ్చినా సరే ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా షేక్ అయిపోతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాను హైదరాబాదులోనే షూటింగ్ చేస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో దాదాపుగా 20% షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రియాంక చోప్రా, మహేష్ బాబు మధ్య కీలక సన్నివేశాలను ఇక్కడే షూట్ చేస్తున్నారు.

Also Read : ఏపీ బడ్జెట్ హైలెట్స్.. సంచలనాలు ఇవే

ఇక ఇక్కడ షూట్ అయిన తర్వాత బ్రెజిల్ లో షూటింగ్ ఉంటుందా.. లేదంటే కెన్యాలో షూటింగ్ జరుగుతుందా అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే ఇప్పుడు టైటిల్ విషయంలో రాజమౌళి ఆలోచనపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ముందు గరుడ అనే టైటిల్ సినిమా కోసం ఫిక్స్ చేయాలని రాజమౌళి భావించారు. కానీ ఆ టైటిల్ విషయంలో నిర్మాత అలాగే హీరో కాస్త భిన్నాభిప్రాయాలను చెప్పటంతో ఇప్పుడు టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

Also Read : జగన్‌కు ఝలక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ..!

త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి టైటిల్ ను అనౌన్స్ చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. టైటిల్ తో పాటుగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు టైటిల్ లో “ఎం ఆర్” అనే అక్షరాలు వచ్చే విధంగా ఉండే ప్లాన్ చేస్తున్నారు. అంటే మహేష్ బాబు, రాజమౌళి అనే అర్థాలు ఇన్ డైరెక్ట్ గా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో రాజమౌళి ఇలాగే ప్లాన్ చేశారు. మహేష్ బాబు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం.. ఈ సినిమాతో రాజమౌళి హాలీవుడ్ ను టార్గెట్ చేయడంతో కాస్త టైటిల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన పేరు కూడా మార్మోగిపోయే విధంగా ప్లాన్ చేసుకోవాలని జక్కన్న స్ట్రాంగ్ వర్కౌట్ చేస్తున్నారు. అందుకే టైటిల్ విషయంలో “ఎం ఆర్” అని వచ్చే విధంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్