Friday, September 12, 2025 03:31 PM
Friday, September 12, 2025 03:31 PM
roots

చంద్రబాబు ఢిల్లీ టూర్, అమరావతికి రైల్వే స్టేషన్…? గురువారం జరగబోయే చర్చ ఏంటీ…?

అమరావతికి ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ రానుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. అమరావతికి రైల్వే స్టేషన్ కావాలనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఏ ముందు అడుగు పడకపోయినా ఇప్పుడు మాత్రం పడే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఈ నెల 7న ఢిల్లీకి సిఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అమరావతికి ప్రపంచబ్యాంకు నిధులు, రైల్వే ప్రాజెక్టులపైన వారితో చర్చించే అవకాశం ఉంది.

ఇప్పటికే రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్మెంట్ ను చంద్రబాబు కోరారు. వైజాగ్ రైల్వేజోన్ భూమి పూజ ముహుర్తంపై అశ్వినీ వైష్ణవ్ తో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇక వరదల పై మరింత కేంద్ర సహాయం పై చర్చించే అవకాశం ఉంది. ఈ తరుణంలో… ఓ కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏపీలో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల పరిధిలోకి వచ్చే లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో..రైల్వే జోనల్ మేనేజర్ గురువారం విజయవాడలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

Read Also : పెద్దాయన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…!

రాష్ట్రంలో చేపట్టాల్సిన రైల్వే లైన్ల నిర్మాణం కొత్త ప్రాజెక్టులపై ఎంపీలు ఇచ్చే ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కీలకమైన రైల్వే ప్రాజెక్టులు గత ఐదేళ్లలో ముందుకు వెళ్ళలేదు. గతప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులేవీ పూర్తికాలేదనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖ కేంద్రంగా మంజూరైన కొత్త జోన్ కార్యాలయాల నిర్మాణానికి భూములను వైసీపీ సర్కార్ అప్పగించలేదు. ఇక రాజధాని అమరావతికి మంజూరైన కొత్తలైన్ పై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు.

గత 5 ఏళ్ళుగా జరిగిన నష్టాన్ని పూడ్చుకుని వేగంగా ప్రాజెక్టుల పనులు చేపట్టేలా చూసేందుకు.. కొత్తవి మంజూరు కోసం సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ అమరావతిలో 6 ఫ్లాట్ ఫాంస్ తో ఓ రైల్వే స్టేషన్ ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. రాజధానికి ఇటు విజయవాడ రైల్వే స్టేషన్ అటు గుంటూరు రైల్వే స్టేషన్ రెండు దూరమే. అందుకే అమరావతి నుంచి ఓ రైల్వే స్టేషన్ అందుబాటులో ఉండాలనే డిమాండ్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు, విజయవాడ, తెనాలి ప్రాంతాలకు అలాగే ఖమ్మం రైల్వే లైన్ కూడా అనుసంధానం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటికే విజయవాడ రైల్వే స్టేషన్ పై భారం పడుతోంది. శాటిలైట్ రైల్వే స్టేషన్ గా రాయనపాడు ఉన్నా రద్దీ కారణంగా సరిపోవడం లేదు. కేవలం గూడ్స్ ట్రైన్స్ కి మాత్రమే వాడుతున్నారు. దాదాపు విజయవాడ రైల్వే స్టేషన్ లో దాదాపు 260 రైళ్ళు రోజు ఆగుతున్నాయి. భవిష్యత్తులో ప్రైట్ కారిడార్ పూర్తి అయితే ఇంకా రైళ్ళు పెరగవచ్చు. ఈ కారిడార్ 3 ప్రకటిస్తే అందులో రెండు విజయవాడ నుంచే వెళ్తున్నాయి. ఇది భవిష్యత్తులో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇక ఇటీవల వరదల సమయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు 500 రైళ్ళను రద్దు చేసే పరిస్థితి ఏర్పడింది. అందుకే విజయవాడ స్టేషన్ తో సంబంధం లేకుండా కొన్ని రైల్వే లైన్ లు అమరావతికి కూడా ఉంటే బాగుంటుంది అనే భావన వ్యక్తమవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్