Wednesday, February 4, 2026 02:14 PM
Wednesday, February 4, 2026 02:14 PM

రాహుల్ ఓటు బాంబు రెడీ..? అందుకే సైలెంట్ గా ఉన్నారా..?

దేశంలో ఓటు చోరీ జరిగిందనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, పదేపదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ఆసక్తి పెరిగిపోతుంది. ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంతో రాహుల్ గాంధీ పూర్తిస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఓటు చోరీ విషయంలో ఇప్పటికే పలు ఆధారాలను బయటపెట్టి.. తీవ్రస్థాయిలో ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ త్వరలోనే మరో బాంబు పేల్చే అవకాశం ఉండవచ్చని.. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో రాహుల్ రెడీ అవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Also Read : అమరావతిలో క్రికెట్ అకాడమీ..!

బీహార్ ఎన్నికల్లో ఫలితాలు తర్వాత.. బీహార్ కు సంబంధించి మరికొన్ని విషయాలను రాహుల్ గాంధీ బయటపెట్టే అవకాశం ఉండవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలను అత్యంత సీరియస్ గా తీసుకున్న రాహుల్ గాంధీ.. తేడా జరిగితే దానికి సంబంధించిన విషయాలను కూడా బయట పెట్టడానికి రెడీగా ఉన్నట్లు ఇటీవల సంకేతాలు ఇచ్చారు. అటు ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా కొన్ని విషయాలను బయటపెట్టేందుకు రాహుల్ రెడీ అవుతున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికల ఫలితాలు తర్వాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లనన్నారు. ఆ తర్వాత.. ఈ ఓటు చోరీ అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రాహుల్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Also Read : ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ ప్రవీణ్ ప్రకాష్.. షాక్ లో అధికార వర్గాలు

అలాగే ఈవీఎంలకు సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా బయట పెట్టేందుకు రాహుల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. బీహార్ లో కూడా ఓటు చోరీ జరిగి ఉండవచ్చని కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అనుమానాలు కూడా బలపడుతున్నాయి అనేది కాంగ్రెస్ నాయకుల వాదన. అందుకే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫలితాలు తర్వాత రాహుల్ మీడియా ముందు ఉంచే అవకాశాలు ఉండవచ్చు. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన వద్ద కీలక సమాచారం ఉందని.. ప్రతి డేటా తాము సేకరించామని రాహుల్ ప్రకటించారు. దీనితో ఎటువంటి సంచలనాలకు రాహుల్.. ప్లాన్ చేస్తున్నారనేది ఆసక్తిని పెంచుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్