ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగాలు ఆకట్టుకుంటున్నాయి. కేంద్రాన్ని విమర్శించే విషయంలో కూడా రాహుల్ గాంధీ కాస్త విభిన్నంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అతిపెద్ద సమస్య అని తాను అనుకోనని రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్ చేసారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో పార్టీ ఓబీసీ నాయకులు నిర్వహించిన ‘భాగీదారీ న్యాయ్ మహాసమ్మేళన్’లో ఆయన మాట్లాడారు.
Also Read : ఎప్పుడైనా మేం రెడీ.. ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ.. ఆర్మీ చీఫ్ కామెంట్స్
ఈ సందర్భంగా ప్రధాని గురించి మాట్లాడుతూ.. మీడియా ఆయనకు ‘చాలా ప్రాముఖ్యత’ ఇచ్చిందని అన్నారు. ‘ఆల్ షో, నో సబ్‌స్టెన్స్’ అంటూ మోడీని విమర్శించారు. రాజకీయాల్లో అతిపెద్ద సమస్య ఏమిటో మీకు తెలుసు.. కాని, నరేంద్ర మోడీ పెద్ద సమస్య కాదన్నారు. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రెండు లేదా మూడు సార్లు కలిశానని చెప్పుకొచ్చారు. మోడీలో విషయం లేదనే విషయం ఆయనను కలిసిన తర్వాత తనకు అర్ధమైందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Also Read : డీ లిమిటేషన్ పై సుప్రీం సంచలన కామెంట్స్..!
మోడీ షో మాత్రమే చేస్తారని, మీరు అతన్ని దగ్గరి నుంచి చూడలేదని, తాను చూశానని సెటైర్ వేసారు రాహుల్. ఇక ఓబీసీలకు జరిగిన అన్యాయంపై ఆయన మాట్లాడారు. తాను 2004 నుండి రాజకీయాల్లో ఉన్నానన్న ఆయన, 21 సంవత్సరాలు అయ్యింది… వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను తప్పు చేశానని నాకు అర్థమవుతోందన్నారు. తాను ఓబీసీలను రక్షించే విధంగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. వారి చరిత్ర, సమస్యలు తనకు తెలిసి ఉంటే, తాను అప్పట్లో కుల గణన నిర్వహించి ఉండేవాడినని అన్నారు.