Friday, September 12, 2025 03:12 PM
Friday, September 12, 2025 03:12 PM
roots

రఘురామ వ్యాఖ్యలతో.. వైసీపీ నేతల్లో భయం..?

60 రోజుల పాటు అసెంబ్లీకి రాని వారి సభ్యత్వం రద్దు అవుతుంది… అంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు వైసీపీ నేతలను భయపెడుతున్నాయనే చెప్పాలి. 2024 మే 13న ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. జూన్ 12న కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ మరుసటి రోజున స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఇంత వరకు బాగానే నడిచింది. ఆ సమావేశాల తొలి రోజున వైసీపీ సభ్యులు 11 మంది శాసనసభకు హాజరయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సభ వైపు చూసిందే లేదు. చివరికి బడ్జెట్ సమావేశాలకు కూడా సభ్యులు రాలేదు. దీంతో వైసీపీ నేతలపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఏబీవీ పోస్టింగ్

కూటమి ప్రభుత్వం 8 నెలలుగా తప్పులు చేస్తోందని… ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలును కూటమి సర్కార్ పూర్తిగా పక్కన పెట్టిందని వైసీపీ నేతలు ప్రతి రోజు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే నిత్యం టీవీ డిబేట్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సరిపెడుతున్నారు. అంతే తప్ప కనీసం క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భాలు కూడా లేవు. ప్రస్తుతమున్న 11 మంది సభ్యుల్లో నలుగురు కొత్త వాళ్లు కూడా ఉన్నారు. తొలిసారి చట్టసభకు ఎన్నికవ్వడంతో.. ప్రజా సమస్యలపై జరిగే చర్చల్లో పాల్గొనాలని.. చాలా ఆశపడ్డారు. అయితే వైసీపీ అధిష్ఠానం మాత్రం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో సభకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో ఆ తర్వాత నుంచి కనీసం ఒక్కసారి కూడా శాసనసభకు హాజరవ్వలేదు.

Also Read : కండలు కరగకుండా బరువు తగ్గాలంటే.. ఇవి ఫాలో అవ్వండి..!

అయితే తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్నాయి. 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే వారి శాసనసభ్వత్వం రద్దు అవుతుందన్నారు డిప్యూటీ స్పీకర్. వాస్తవానికి ఇప్పటికే దాదాపు 30 రోజులు గడిచిపోయింది. ఇక ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి 3 వారాల పాటు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఏడాది లోపే సభ 60 రోజులు గడిచినట్లు అవుతుంది. అంటే డిప్యూటీ స్పీకర్ చెప్పినట్లుగా ఏడాది లోపే తమ శాసనసభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉందని వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు జరిగితే.. ఎన్నికయ్యే అవకాశం ఏ మాత్రం లేదు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్