ఇంతకూ ఆ లేఖ నిజమేనా…? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇంతకూ ఆ లేఖ ఏమిటి.. అందులో నిజమెంతా.. ఎవరు రాశారు.. ఎవరికి రాశారు.. బయటకు ఎలా వచ్చింది.. ఎవరు విడుదల చేశారు.. ఇవే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ లేఖ ఏమిటనుకుంటున్నారా.. అదే చిరంజీవి రాశారంటూ సోషల్ మీడియాలో ఉన్న లేఖ. అసెంబ్లీలో బాలకృష్ణ ఏదో అన్నారని.. దానిపై స్పందిస్తున్నట్లు చిరంజీవి పేరుతో లేఖ బయటకు వచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
Also Read : ఎమ్మెల్యేలు ఆ పనులు చేయాలి.. చంద్రబాబు కీలక ప్రసంగం
అసలు బాలకృష్ణ ఏమన్నారు.. చిరంజీవి ఎందుకు స్పందించారు..? అనే అందరూ చర్చించుకున్నారు. చిరంజీవిని బాలయ్య వాడు.. వీడు అన్నారని.. దీనిపై వెంటనే జరిగిన విషయం ఇది.. అని చిరంజీవి లేఖ ద్వారా వివరణ ఇచ్చినట్లుగా రెండు రోజుల పాటు అంతా గగ్గొలు పెట్టారు. ఇక దీనిపై వెంటనే చిరంజీవి అభిమానుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. చిరంజీవి స్వయంగా వివరణ ఇచ్చారు కాబట్టి.. వెంటనే బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
అగ్నికి ఆజ్యం పోసినట్లుగా చిరంజీవి అభిమానులను మరింత రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు కూడా వంత పాడుతున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. చిరంజీవి పేరుతో వచ్చిన లేఖ నిజమేనా.. అసలు ఆ లేఖ చిరంజీవి విడుదల చేసిందేనా.. ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకటం లేదు. వాస్తవానికి చిరంజీవి ఇండియాలో లేరు. ఆయన అమెరికాలో ఉన్నారు. బాలకృష్ణ సభలో మాట్లాడినప్పుడు అమెరికాలో సమయం అర్థరాత్రి 3 గంటలు దాటింది. ఆ సమయంలో నిద్ర పోకుండా.. బాలకృష్ణ మాటలను చిరంజీవి విన్నారా.. అసెంబ్లీలో ఆ అంశంపైనే చర్చ జరుగుతుందని ఆయనకు ముందె తెలుస్తా..?
ఇక ఇప్పుడు అసలు విషయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియా ద్వారానే ప్రతి ఒక్కరు బయటపెడుతున్నారు. చివరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కీలక విషయాలను సోషల్ మీడియా ద్వారానే ప్రకటిస్తున్నాయి. ఎవరికైనా శుభాకాంక్షలు అయినా, సంతాపం అయినా సరే.. సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారు. మరి అలాంటి సోషల్ మీడియా ద్వారానే చిరంజీవి కూడా ఎంతో సార్లు తన అభిప్రాయాలు వెల్లడించారు.
Also Read : చంద్రబాబు సీరియస్.. బాలయ్య క్షమాపణ చెప్తారా..?
కానీ ఈసారి మాత్రం కనీసం తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఎలాంటి పోస్ట్ లేదు. పైగా బయటకు వచ్చిన లేఖ మీద చిరంజీవి సంతకం లేదు. చిరంజీవి అధికారిక లెటర్ హెడ్ కాదు. ఏదో వాట్సప్ ద్వారా చిరంజీవి అంటూ వచ్చిన లేఖ ఆఘమేఘాల మీద వైరల్ అయ్యింది. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం ఎవరూ పట్టించుకోలేదు. దీనిపై ఇప్పటి వరకు చిరంజీవి కార్యాలయం కూడా వివరణ ఇవ్వలేదు.