ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సమయం వచ్చింది. ఏపీలో ప్రధానంగా తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. వీటితో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా మరో పార్టీ వస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుగా కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ కూడా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతమున్న ప్రధాన పార్టీలకు కులం, మతం అండ ఉందనే మాట బాగా వినిపిస్తోంది. టీడీపీ అంటే కమ్మ అని, జనసేన అంటే కాపు అని, వైసీపీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పార్టీ అనేది ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి భావన. ఇక బీజేపీ అంటే హిందుత్వ అజెండాతోనే నడుస్తుంది. ఈ నేపధ్యంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : లోకేష్ పేరు వాడితే అంతే.. టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్..?
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు నందమూరి తారక రామారావు చేసిన ప్రసంగ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంది. రైతులు, వెనుకబడిన కులాలు, మధ్యతరగతి ప్రజల పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో తెలుగు వాడి ఆత్మగౌరవం అంటూ టీడీపీకి గుర్తింపు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలపై వ్యతిరేకతోనే వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ వైసీపీ ప్రారంభించారు. ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఉండాలనే నినాదంతో జనసేన ప్రారంభించారు పవన్. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో కొత్త ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందని ఆయన అభిమానులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేశారు. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏఐఎం అనే సంస్థ నడుస్తోంది. అంబేద్కర్ ఇంటలెక్చువల్ మూమెంట్ పేరుతో అంబేద్కర్ సిద్థాంతాల కోసం పోరాటం చేస్తున్నట్లు సునీల్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పోలీసులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, వ్యాపారస్తులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎం ఆధ్వరంలో ర్యాలీలు చేస్తున్నారు. సభలు నిర్వహిస్తున్నారు.
Also Read : జగన్ సిఎం అవ్వాల్సిందే.. కొడాలి నాని సంచలన కామెంట్స్
తాజాగా పీవీ సునీల్ కుమార్‌కు సంబంధించిన వీడియోను ఏఐఎం ప్రతినిధులు విడుదల చేశారు. పీవీ సునీల్ కుమార్ నాయకత్వంలో రానున్న కొత్త రాజకీయ పార్టీ కేవలం పార్టీ కాదన్నారు. పీడిత వర్గాల ఆశల ప్రతిధ్వని అని.. ఇది ప్రజల గళం.. ఇది వ్యవస్థపై పోరాటానికి సిద్ధమైన కొత్త శక్తి అంటూ వ్యాఖ్యానించారు. అధికారం కోసం కాదు… ఆత్మగౌరవం కోసం ఉద్యమం.. కుర్చీల కోసం కాదు… భవిష్యత్తు కోసం యుద్ధం.. అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. పీవీ సునీల్ కుమార్ నాయకత్వం.. ప్రజల నమ్మకం – మార్పుకు నాంది.. అంటూ ప్రకటించారు. ఇటీవల ఉమ్మడి విజయనగరం జిల్లాలో పర్యటించిన సమయంలో రాజకీయాలపై సునీల్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం పదవి కాపులు తీసుకుని.. డిప్యూటీ సీఎం దళితులకు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. కాపులు, దళితులు ఏకమవ్వాలంటూ సునీల్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి కూడా. అప్పుడే సునీల్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. ఇప్పుడు ఈ విషయంపై ఆయన అభిమానులు క్లారిటీ ఇచ్చారు.

