అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా.. ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో రికార్డులు నెలకొల్పి తెలుగు సినిమా దమ్ము ఏంటో ప్రూవ్ చేసింది. ఇక జనవరి 30న నెట్ఫ్లిక్స్ ఫ్లాట్ ఫాంలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా… నెట్ఫ్లిక్స్ లో కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఓటీటీ లోకి వచ్చిన నాటి నుంచి వ్యూస్ పరంగా ఈ సినిమా టాప్ లో ఉంది. ఏడు దేశాల్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
Also Read : వివేకా కేసులో కీలక అడుగు.. ఇప్పుడైనా అరెస్ట్ అవుతారా…?
ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్ తో నెట్ఫ్లిక్స్ రెండో స్థానంలో నిలిచింది. ఇది తెలుగు సినిమాకు దక్కిన అరుదైన ఘనత అని అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉందని కామెంట్స్ వస్తున్నాయి. రీలోడేడ్ వెర్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. మొదట మూడు గంటల 20 నిమిషాల రన్ టైం తో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా… ఆ తర్వాత మరో 20 నిమిషాలు ఆడ్ చేశారు. దీనితో సినిమా దాదాపు మూడు గంటల 40 నిమిషాలు అయింది.
Also Read : ఎమ్మెల్యే గారి వైసీపీ ప్రేమ.. కృష్ణా జిల్లాలో అలజడి..!
ఇక ఓటిటిలో కూడా ఇదే వెర్షన్ అందుబాటులో ఉంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. జాతర ఎపిసోడ్ జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇక సోషల్ మీడియాలో దానికి సంబంధించిన రీల్స్ కూడా షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిన పుష్ప సీక్వెల్… నార్త్ ఇండియాలో వసూళ్ల పరంగా దుమ్మురేపింది. అయితే హిందీలో మాత్రం ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు. ఇక 32 రోజుల్లోనే ఈ సినిమా బాహుబలి 2 రికార్డులు అన్ని బ్రేక్ చేసేసింది. దీనితో ఇక నుంచి నాన్ పుష్ప రికార్డులుగా తెలుగు సినిమాను అలాగే ఇండియన్ సినిమా రికార్డులను చెప్పనున్నారు.