Monday, October 27, 2025 07:48 PM
Monday, October 27, 2025 07:48 PM
roots

పుష్ప2 ఫస్ట్ సింగిల్ రిలీజ్

దేశమంతా ఎంతో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. పుష్ప 2: ది రూల్ చిత్రం నుంచి తొలి పాట అడుగుపెట్టింది. పుల్ జోష్‍తో పక్కా మాస్ బీట్‍తో ఉన్న ఈ పాటను మూవీ టీమ్ నేడు (మే 1) రిలీజ్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై క్రేజ్ భారీ స్థాయిలో ఉంది. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినీ ప్రేక్షకులంతా ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో పుష్ప 2 సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ నేడు వచ్చేసింది.

‘పుష్ప.. పుష్ప.. పుష్ప’ అంటూ పుష్ప 2: ది రూల్ నుంచి తొలి పాటవచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ పాటకు ఫుల్ మాస్ బీట్ ఇచ్చారు. తెలుగులో నాకాశ్ అజీజ్, దీపక్ బ్లూ ఈ సాంగ్‍ను పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

టీ గ్లాస్ పట్టుకొని..
పుష్ప 2లోని ఈ తొలి సాంగ్ లిరికల్ వీడియోలో అల్లు అర్జున్ స్టెప్స్ అదిరిపోయాయి. వీడియో చివర్లో టీ గ్లాస్‍ పట్టుకొని ఆయన వేసిన డ్యాన్స్ సూపర్‌గా ఉంది. పుష్ప రాజ్‍గా ఐకాన్ స్టార్ స్వాగ్, స్టైల్ దద్దరిల్లిపోయాయి. ‘అసలు తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ ఐకానిక్ డైలాగ్ కూడా చివర్లో ఉంది. పుష్ప 2: ది రూల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నార్త్ ఇండియా హిందీ హక్కుల్లోనూ ఇప్పటికే ఈ మూవీ రికార్డు సృష్టించింది. బాలీవుడ్ చిత్రాలను వెనక్కి తోసింది. ఆ రేంజ్‍లో హిందీలోనూ ఈ మూవీకి క్రేజ్ ఉంది.

మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా దేశాన్నంతా ఊపేసింది. అల్లు అర్జున్ స్టైల్, స్వాగ్, మేనరిజమ్స్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాలు అందరినీ మెప్పించాయి. పాన్ ఇండియా రేంజ్‍లో బాక్సాఫీస్‍ను పుష్ప షేక్ చేసింది. దీంతో సీక్వెల్‍గా వస్తున్న పుష్ప 2 సినిమాపై కూడా క్రేజ్ చాలా ఉంది. అంచనాలు ఆకాశమంత ఉన్నాయి. సీక్వెల్ మూవీని మరింత భారీగా, కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో రూపొందించారు దర్శకుడు సుకుమార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలు మెండుగా ఉన్నాయి.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్