Thursday, October 23, 2025 10:18 PM
Thursday, October 23, 2025 10:18 PM
roots

వెజ్ లో మంచి ప్రోటీన్ దొరికే ఆహారం ఇదే..!

వెజ్ తినే వాళ్లకు ప్రోటీన్ ఎలా అనే ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. ప్రోటీన్ కావాలి అంటే నాన్ వెజ్ తినాలి అనేది చాలా మందిలో బలంగా ఉన్న అభిప్రాయం. కానీ అది కరెక్ట్ కాదంటారు నిపుణులు. కూరగాయల్లో అద్భుతమైన ప్రోటీన్ ఉందని చెప్తూ సూచనలు చేస్తున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ కథనం ప్రకారం.. కూరగాయాల్లో మంచి ప్రోటీన్ లు ఉన్నాయి. కండరాల పెరుగుదలలో ప్రోటీన్ పాత్ర చాలా కీలకం కావడంతో చాలా మంది ప్రోటీన్ పౌడర్ కూడా వాడుతూ ఉంటారు. కాని అది మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

Also Read : త్వరలో మంత్రివర్గంలో భారీ మార్పులు..!

బీన్స్, చిక్కుళ్ళు తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్, సోయాబీన్స్, చిక్‌పీస్ మరియు బ్లాక్ బీన్స్ వంటివి, చిక్కుళ్ళు మాంసానికి గొప్ప ప్రత్యామ్నాయం. వీటిని కూరలు, సూప్‌లు, సలాడ్‌లలో ఉపయోగించవచ్చు. గింజలు, విత్తనాలు కూడా ఉపయోగమే. వాటిని అల్పాహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఓట్స్ లేదా పెరుగులో తినవచ్చు. లేదంటే స్నాక్ ఐటెం గా కూడా వాడితే మంచిది. వేరుశెనగ, బాదం, జీడిపప్పు, హాజెల్ నట్స్, పెకాన్స్, పిస్తాపప్పులు, నువ్వులలో ప్రోటీన్ లు ఎక్కువ.

Also Read : షాకింగ్: అమెరికా పౌరసత్వం వదులుకుంటున్న అమెరికన్లు..!

తృణధాన్యాలలో కూడా మంచి ప్రోటీన్ లు ఉన్నాయి. ఓట్స్, క్వినోవా, బార్లీ, మిల్లెట్, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు ప్రాసెస్ చేయకుండా తీసుకుంటే ఇంకా మంచిది అని సూచిస్తున్నారు. వీటిల్లో ప్రోటీన్ ఎక్కువగా లభ్యమవుతోంది. సహజ ప్రోటీన్ పెరుగుదల కోసం బఠానీలు, మొక్కజొన్న, ఆస్పరాగస్, బ్రోకలీ వంటి ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు నిపుణులు. ఇక పాలలో కూడా ప్రోటీన్ లు ఎక్కువే. ఐస్లాండిక్ స్కైర్, కాటేజ్ చీజ్, గ్రీక్ పెరుగు, హోల్ మిల్క్, అలాగే చెడ్డార్, మోజారెల్లా చీజ్ లో ప్రోటీన్ లు ఎక్కువ.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్