వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. తన సోదరి… వైఎస్ షర్మిలకు ఆస్తులు ఇవ్వడాన్ని వైఎస్ జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఆస్తుల్లో తన చేల్లెలకు ఏ మాత్రం వాటా లేదని జగన్ ఇప్పుడు ఏకంగా కోర్ట్ కు ఎక్కారు. ఈ మేరకు జగన్… నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసిన విషయం తాజాగా సంచలనం అవుతోంది. ఈ ఏడాది జగన్… క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్, వైస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి పేర్లతో ఐదు పిటిషన్లను దాఖలు చేయడం దుమారం రేపుతోంది.
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్, జగన్ సోదరి వైఎస్ షర్మిలా రెడ్డి, ఆయన తల్లి… వైఎస్ విజయమ్మ పాటుగా చాగారి జనార్థన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజనర్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను రెస్పాండెంట్లుగా పేర్కొంటూ పిటీషన్ వేసారు. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే వీటిని దాఖలు చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ 3వ తేదీన ఒక పిటిషన్, సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు, అక్టోబర్ 18న మరో పిటిషన్ దాఖలు చేసారు. జగన్మోహన్ రెడ్డి, షర్మిల రెడ్డి, క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో పిటీషన్ వేసారు.
Also Read : జగన్ సుద్దపూస కబుర్లు.. నవ్విపోతున్న ప్రజలు
సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్‌లో వైఎస్ జగన్ కు షేర్లు ఉన్నాయని ఈ ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా అఫిడవిట్ లో ప్రస్తావించారు. ఆ షేర్ల విషయంలోనే షర్మిలకు జగన్ కు మధ్య విభేదాలు రావడంతోనే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 2019 ఆగస్టు 21 ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు కంపెనీ షేర్లు కేటాయించామని, అయితే వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని ప్రస్తావించారు. వారి షేర్లను తాము విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తన చెల్లెలు చీటర్ అంటూ జగన్ పిటీషన్ లో ప్రస్తావించడం గమనార్హం.