రాజమౌళి సినిమా అనగానే జనాలకు ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అలాంటి రాజమౌళి.. మహేష్ బాబు లాంటి మాస్ హీరోతో సినిమా చేస్తే ఆ లెవెల్ వేరే. ఎప్పుడో ఎనౌన్స్ చేసిన ఈ సినిమా లేటెస్ట్గా షూటింగ్ కు వెళ్ళింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఒడిస్సాలో షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో రాజమౌళి సినిమాలకు ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంది. సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసే టార్గెట్ పెట్టుకున్నాడు రాజమౌళి. మహేష్ బాబు నుంచి కూడా కంప్లీట్ సపోర్ట్ ఉండటంతో కమిట్మెంట్ తో వర్క్ చేస్తున్నాడు జక్కన్న.
Also Read : సాక్షి మూసేస్తున్నారా..?
ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సలార్ సినిమాతో తెలుగు జనాలకు పరిచయమైన పృథ్వీరాజ్… ఈ సినిమాతో తెలుగు మార్కెట్ భారీగా పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక లేటెస్ట్ గా ఒక ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ స్టార్ హీరో. రీసెంట్ గా రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సినిమాలోని ఒక సన్నివేశం లీక్ అవ్వగా దాని గురించి మాట్లాడాడు. లీక్ వీడియోలపై జనాలకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో తనకి ఎప్పటికీ అర్థం కాదని… సినిమాలో సీన్స్ థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే బాగుంటుందని కామెంట్ చేశాడు.
Also Read : రెబల్ ఫ్యాన్స్ కు.. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఫెస్టివల్
ఇక రాజమౌళి తో తాను ఏడాది నుంచి వర్క్ చేస్తున్నానని.. ఈ సినిమా తన కెరీర్లో ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశాడు. త్వరలోనే ఈ సినిమా గురించి క్రేజీ అప్డేట్స్ రిలీజ్ అవుతాయని చెప్పుకొచ్చాడు. గతంలో కంటే ఇప్పుడు సినిమాల్లోకి రావడం చాలా ఈజీ అని.. రీల్స్ లేదంటే ఏదైనా ఒక చిన్న వీడియోతో ఫేమస్ అయిపోవచ్చు అని.. కామెంట్ చేశాడు. ఇక పృధ్విరాజ్ డైరెక్షన్లో మోహన్లాల్ నటించిన సినిమా మార్చ్ 27న ప్రేక్షకులు ముందుకు రానుంది. లూసిఫర్ సినిమా సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది.




