Sunday, October 19, 2025 12:01 PM
Sunday, October 19, 2025 12:01 PM
roots

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్..!

సౌత్ ఇండియాలో రియల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలు అనగానే సినీ జనాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. సినిమా అనౌన్స్ చేసిన దగ్గరి నుంచి రిలీజ్ అయ్యే వరకు ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. ఇక వచ్చే ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తూ.. బాక్సాఫీస్ లో బజ్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఆరు సినిమాలు ఉంటే.. అందులో రిలీజ్ కు దగ్గర పడుతున్న సినిమా రాజా సాబ్. మారుతీ డైరెక్షన్ లో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా త్వరలో విడుదల కానుంది.

Also Read : మాకు భారత్ కావాలి.. ఆఫ్ఘన్ మంత్రి కీలక వ్యాఖ్యలు..!

ఇక సినిమాలో ప్రభాస్ లుక్స్, సినిమా అప్డేట్ ఇప్పటికే హీట్ పెంచాయి. ఈ సమయంలో సినిమాలో ఓ సాంగ్ కు సంబంధించి వీడియో ఒకటి లీక్ అయింది. ఇందులో ప్రభాస్ లుక్స్ పక్కా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ వీడియోలో ప్రభాస్ రెడ్ కలర్ కాస్ట్యూమ్ లో ఊర మాస్ లుక్ లో కనిపించాడు. కళ్ళజోడుతో చాలా స్టైలిష్ గా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ ను ఫ్యాన్స్ గతంలో ఎప్పుడూ చూసి ఉండరు కూడా. ఇప్పటికే సినిమాకు వచ్చిన హైప్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఫ్యాన్స్ కు ఈ లీక్ మరింత ఎనర్జీ ఇచ్చింది.

Also Read : బీహార్ పై బిజెపి ఫోకస్.. సంచలన ప్రకటన రానుందా..?

అందమైన సెట్ డిజైన్, గ్రాండ్ విజువల్స్ తో ఈ సాంగ్‌ మేకింగ్ ఉంది. ఇక తమన్ కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే కల్కీ సినిమాతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ తో మరోసారి బాక్సాఫీస్ పై వార్ డిక్లేర్ చేసేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం నిధీ అగర్వాల్ తో ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కామెడి కూడా ఉండే ఛాన్స్ ఉందని టాక్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్