ప్రభాస్ కల్కి 2898 ఏడీ రిలీజ్ ఎప్పుడన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ భారీ బడ్జెట్ మూవీ వాయిదాపడింది. ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్‌పై నిర్మాతల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. నాగ్ అశ్విన్ బర్త్‌డే సందర్భంగా కల్కి కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ డైరెక్టర్ బర్త్‌డే రోజు కల్కికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ వెల్లడించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
తాజాగా కల్కి రిలీజ్ డేట్‌కు సంబంధించి కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ అభిమానులకు ఇది తీపి కబురుగానే భావించవచ్చు. ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ ల డ్రీం ప్రాజెక్ట్ కల్కి 2898 AD సినిమా రిలీజ్ డేట్ ను జూన్ 27 గా చిత్ర బృందం ప్రకటించింది. కల్కి 2898 AD మొదట్లో మే 9న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా విడుదల వాయిదా పడింది. మరియు ప్రభాస్ కూడా ఈ సినిమా ని జూలైలో విడుదల చేయాలని కోరటంతో చిత్ర బృందం జూన్ 27 నే ఫైనల్ చేసింది. అయితే మే లో జరగనున్న ఎన్నికల హడావిడి అనంతరం సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చిత్ర బృందం బావిస్తోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి 2898 ఏడీ’ లో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తోంది . మరియు ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామగా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ పాత్రని అతి త్వరలోనే పరిచయం చేయడానికి చిత్రబృందం కసరత్తులు చేస్తోంది. సలార్ సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తోన్న కల్కి మూవీపై దేశవ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ పరంగా ఇండియన్ సినిమా రికార్డలన్నింటిని కల్కి అధిగమించే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.