తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక చరిత్ర లిఖించుకున్న నటుల్లో ప్రభాస్ ఒకరు. బాహుబలి సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్ళిన ఘనత అటు దర్శకుడు రాజమౌళితో పాటు ఇటు నటుడు ప్రభాస్ కి కూడా దక్కుతుంది. అలాంటి ప్రభాస్ కి ఫ్యాన్ క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటులు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టార్ హీరోగా రాణించాలంటే కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ హీరోగా పేరు తెచ్చుకోవడమే కాకుండా పాన్ ఇండియా లో తనతో పోటీ పడే నటుడు మరొకరు లేరు అనేంతలా ఆయన తన సత్తా చాటుతూ వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నాడు.
ఇక దాంతోపాటుగా ఆయన ఇప్పుడు రెస్ట్ లేకుండా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ప్రతి హీరో ఎలాగైతే సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడో ప్రభాస్ కూడా అదే మాదిరిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా తను ఇన్స్టాలో పెట్టిన ఒక స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది. అది ఏంటంటే “డార్లింగ్స్ తొందరలోనే నా లైఫ్ లోకి ఒక కొత్త పర్సన్ రాబోతున్నారు” అంటూ ఆయన పెట్టిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. గత కొంత కాలంగా ప్రభాస్ వివాహం విషయం పై పలు రకాల ఊహాగానాలు వస్తున్నా విషయం తెలిసిందే. అభిమానులు అందరూ ఆయన వివాహం గురించే ఆ పోస్ట్ అంటూ ఆనందంలో ఉన్నారు.
ఇక ఈ స్టోరీ చూసిన కొందరు ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడేమో కొత్త పర్సన్ అంటే తన భార్య కావచ్చు అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఏదో ప్రమోషన్ చేయబోతున్నాడు దానికి సంబంధించిన విషయం చెప్తాడేమో అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ప్రభాస్ కు సంబంధించిన న్యూస్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తీరిక లేకుండా సినిమాలకి కమిట్ అయి ఉన్నాడు.
కాబట్టి తనకి ఇప్పుడు పెళ్లి చేసుకునే సమయం లేదు. ఇక పెళ్లికి సంబంధించిన విషయాలు కాకుండా వేరే విషయాలను తను చెప్పబోతున్నట్టుగా కూడా మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే యంగ్ రెబల్ స్టార్ ఏం చెబుతాడా అనే దానికోసమే చాలామంది ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. మరి దీని పై ప్రభాస్ ఏమి చెబుతాడో చూడాల్సిందే.