Friday, September 12, 2025 07:06 PM
Friday, September 12, 2025 07:06 PM
roots

పోసాని అరెస్ట్ తో వారిలో వణుకు మొదలైందా..?

వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో పోసాని కృష్ణమురళీని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.. అన్నమయ్య జిల్లా సంబేపల్లికి తరలించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు పోసాని. చివరికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్‌లో ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. అదే సమయంలో నంది అవార్డుల ప్రధానంపై కూడా పోసాని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపాయి. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మాట మార్చేశారు. అరెస్టు చేస్తారనే భయంతో.. రాజకీయాలకు గుడ్ బై అంటూ పోసాని ప్లేట్ ఫిరాయించారు.

Also Read : ఏపీలో కొంప ముంచుతున్న ఏనుగులు..?

ఇకపై ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యాఖ్యలు చేయనని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే.. గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోసానిపై కేసు నమోదు చేసిన పోలీసులు… హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇంట్లో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. పోసాని అరెస్టుతో వైసీపీ నేతల్లో భయం మొదలైందనే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. కొందరైతే వ్యక్తిత్వ హననానికి కూడా దిగజారారు. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే నాటి ప్రభుత్వం కానీ, వైసీపీ పెద్దలు కానీ ఏ మాత్రం ఖండించలేదు. పైగా వారికి కోపం వచ్చింది… అందుకే ఇలా వ్యాఖ్యానించారు.. అంటూ సమర్థించారు కూడా. వైసీపీ ఓటమి తర్వాత అలాంటి వారిపై తెలుగుదేశం, జనసేన నేతలు కేసులు పెట్టడంతో ఇప్పటికే పోలీసులు చర్యలు ప్రారంభించారు.

Also Read : మోక్షజ్ఞ ప్రాజెక్ట్ పై ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇదేనా?

ఇంటూరి రవికిరణ్, అవుతు శ్రీధర్ రెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి వంటి వైసీపీ సోషల్ మీడియా సైకోలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోసాని అరెస్టుతో మరికొందరు నేతల్లో భయం మొదలైంది. పోసాని తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి శ్రీరెడ్డి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. చివరికి రాయలేని పదాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌పై విమర్శలు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే… రుద్రాక్ష ధరించిన శ్రీరెడ్డి… “నేను మారిపోయాను… నన్ను మన్నించండి.. ఇంకెప్పుడు రాజకీయాల గురించి వ్యాఖ్యలు చేయను.. తప్పైపోయింది..” అంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పటికే శ్రీరెడ్డిపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ నేతలు. అయితే ఆరోగ్యం బాగోలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన శ్రీరెడ్డి… అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే తరహాలో సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న పలువురు వైసీపీ అభిమానులు కూడా పోసాని అరెస్టుతో భయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

2 COMMENTS

  1. అసలు రాజకీయాల్లో నాయకుడు కాదు…..వాడి బాబు అయినా సరే ఎవ్వరిని దుషించకూడదు….అనే స్థాయి లొ ట్రీట్మెంట్ ఉండాలి….

    • వాడు నిద్రపోకుండా వాడు తిట్టిన మాటలన్నీ వాడికే వినిపిస్తూ ఉండాలి. బహుశా ఒక ఎనిమిది గంటలు విరామం లేకుండా వాడు మాట్లాడిన మాటలు తిట్లను వరుస పెట్టి విరామం లేకుండా వినిపించాలి.

Comments are closed.

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్