Friday, September 12, 2025 05:31 PM
Friday, September 12, 2025 05:31 PM
roots

చంద్రబాబు బర్త్ డే స్పెషల్.. అపర చాణక్యుడు..!

పరిపాలనా దక్షత, రాజకీయ చాతుర్యానికి పెట్టింది పేరైన చంద్రబాబుని అపర చాణక్యుడు అని అంటారు. తనకు జీవితంతో ఒక ప్రధానమైన లక్ష్యం ఉందని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే తన సహచరుల దగ్గర చంద్రబాబు అంటుండే వారంట.. అది సరిగ్గా 20 ఏళ్ల తర్వాత నెరవేరింది. 1995 సెప్టెంబర్‌లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు 20 ఏళ్ల క్రితం తన సహచరుల ముందు ఆయన పెట్టుకున్న టార్గెట్ అదేనంటారు.

సామాన్య కుటుంబంలో పుట్టిన వాళ్లు ఇలాంటి కలలు ఎన్నో కంటారు. ఆయితే ఆ కోరికలు నెరవేరడం కోసం అనుసరించాల్సిన మార్గాన్ని ఎంచుకోవడంలో, వ్యూహాన్ని రచించుకోవడంలోనే అసలైన విజయం ఉంటుంది. అటువంటి విజేతలు చాలా కొద్దిమంది ఉంటారు. అందులో చంద్రబాబు నాయుడు ఒకరు. అందుకే ఆయన సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ అయ్యారు.

Also Read : అందుబాటులోకి వస్తున్న అన్న.. ప్యాలెస్ లో సందడి వాతావరణం

1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు కుట్ర చేసి ఎన్టీఆర్‌ను గద్దె దించి ముఖ్యమంత్రి అయ్యారు. నాదెండ్లకు ఆ మురిపెం నెలరోజులే మిగిలింది. నాదెండ్లను గద్దె దించడానికి ప్రతిపక్షాలన్నీ ఉద్యమించాయి. వాటన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత అపరచాణక్యుడిదే. అప్పుడే చంద్రబాబు రాజకీయ కుశలత లోకానికి తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి వారిని రాష్ట్రపతి ఎదుట పరేడ్ చేయించారు. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమ ప్రభావానికి నాదెండ్ల భాస్కర్ రావు పాలన 31 రోజుల్లోనే అంతమై మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు చాకచక్యానికి ముగ్ధుడైన ఎన్టీఆర్.. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబును నియమించారు.

1989లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, టీడీపీ కార్యకలాపాలను చంద్రబాబే సమన్వయం చేసేవారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ సమర్థంగా పనిచేయడంలో చంద్రబాబు ప్రతిభ ఫోకస్ అయింది. ఆయన పని తీరును పార్టీ నాయకులే కాక ప్రజలూ గుర్తించారు. శాసన సభలోనూ, వెలుపలా ఆయన వ్యవహరించిన తీరే తరవాత తెలుగుదేశం మళ్లీ అధికారం చేపట్టడానికి దోహదం చేసిందన్న అభిప్రాయం ఉంది. ఇక 1995లో సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిన అభివృద్ది గురించి వేరే చెప్పుకోనవసరం లేదు. పేదరికం తాండవిస్తున్న, కునారిల్లుతున్న గ్రామాలున్న రాష్ట్రాన్ని కేవలం అయిదేళ్ల కాలంలో సమాచార-సాంకేతిక పరిజ్ఞానానికి కేంద్రంగా మార్చారని, చంద్రబాబు గురించి టైమ్ పత్రిక అప్పట్లో వ్యాఖ్యానించింది. ఆ సంవత్సరం బాబును దక్షిణాసియాలోకెల్లా మేటి నాయకుడు అని కొనియాడింది.

Also Read : రోజాకు అండగా కూటమి మంత్రి

2004 నుంచి రెండు పర్యాయాలు చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్రకే పరిమితమవ్వాల్సి వచ్చింది. తాను సీఎంగా ఉన్నప్పుడు అభివ‌ృద్దిపై పెట్టినంత ఫోకస్ ఆయన సంక్షేమ పథకాలపై పెట్టలేదన్న అపవాదు ఉంది. అప్పట్లో చంద్రబాబు తాను రాష్ట్రానికి సీఈఓను అని చెప్పుకునేవారు. డెవలప్‌మెంట్ విషయంలో అలాగే వ్యవహరించేవారు. అందుకే రాష్ట్ర విభజన తర్వాత ఆయన సంక్షేమానికి కూడా పెద్ద పీట వేశారు. రాష్ట్రం విడిపోయిన తరవాత అమరావతిలో కొత్త రాజధాని నిర్మించడం కోసం రైతుల దగ్గర 34 వేల ఎకరాల భూమి సేకరించారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే సారవంతమైన భూముల్ని రైతులు రాజధానికి ఇచ్చారు.

కొత్త రాజధాని నిర్మాణానికి అమరావతి దగ్గరలోని ఉద్దండరాయని పాలెంలో 2015 అక్టోబర్ 22న జరిగిన శంకుస్థాపన సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో పాటు జపాన్, సింగపూర్ మంత్రులు కూడా హాజరయ్యారు. అయితే తర్వాతర్వాత కేంద్రం నుంచి రాజధాని, పోలవరం నిర్మాణాలకి పూర్తిస్థాయిలో సహకారం అందకపోయినా.. వాటికి ఒక రూపం తీసుకురావడంలో ఆయన ఉన్నంతలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచి ఉంటే అమరావతి రూపురేఖలు మారిపోవడంతో పాటు… పోలవరం కూడా పూర్తయ్యేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Also Read : వైసీపీలో దర్శకత్వ సమస్య.. జగన్ డైరెక్టర్ ఎవరో..?

నాలుగోసారి సీఎం పదవి చేపట్టిన చంద్రబాబు.. తెలుగు రాష్ట్రాల్లో ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న రికార్డు సొంతం చేసుకున్నారు. ఎక్కువ కాలం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదీ ఆయనే. ఒక ప్రాంతీయ పార్టీ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్నా మనుగడ సాగించడం మళ్లీ అధికారంలోకి రావడం బహుశా దేశ చరిత్రలోనే అరుదు. తెలుగు దేశం పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా చెక్కుచెదరకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు రాజకీయ సమర్ధతే కారణమని చెప్పవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్