Friday, September 12, 2025 10:39 PM
Friday, September 12, 2025 10:39 PM
roots

కడప వైసీపీలో రాజకీయ రచ్చ..!

కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబ కంచుకోట. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడైనా… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయినా సరే ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ కుటుంబ పెత్తనమే నడిచింది. ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు పది అసెంబ్లీ స్థానాలను కూడా అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ గెలుస్తూనే ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి హవాలో కూడా ఉమ్మడి కడప జిల్లా పరిధిలోని కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలతో పాటు పులివెందుల, బద్వేలు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. కడప జిల్లాలో చాలా వరకు వైఎస్ కుటుంబ సభ్యులతో పెత్తనం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి కడప జిల్లా అంటే వైసీపీకి పెట్టని కోట. అలాంటి కడప గడపలో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.

Also Read : వీర్రాజుకు టికెట్ ఇవ్వటం ఇష్టం లేదా..?

కడప వైసీపీలో జడ్పీ పీఠం చిచ్చు పెడుతోంది. ప్రస్తుతం వైసీపీలో రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటను కాదని ఎవరికి వారే రాజకీయాలు చేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం వైసీపీ నేతలు చాప కింద నీరులా రాజకీయాలు చేస్తున్నారు. చివరిక సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేస్తున్నారు కూడా. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 2019 ఎన్నికల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని కాదని మల్లికార్జున రెడ్డికి టికెట్ ఇచ్చారు వైఎస్ జగన్. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని అమర్నాథ్ రెడ్డికి కేటాయించారు. అయితే 2024 ఎన్నికల్లో మల్లికార్జున రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో… ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాల కారణంగా రాజంపేటలో వైసీపీ గెలిచింది. దీంతో జెడ్పీ చైర్మన్ పదవికి ఆకేపాటి రాజీనామా చేశారు.

Also Read : మౌనమే.. విజయసాయి రెడ్డిపై సైలెంట్ గా వైసీపీ

అమర్నాథ్‌ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్… ఆయన స్థానంలో రామ్‌గోపాల్ రెడ్డిని చైర్మన్‌గా నియమించారు. అయితే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో జీవో విడుదల కాలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఇప్పటి వరకు జీవో విడుదల కాలేదు. దీంతో కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ప్రస్తుతం కేవలం 15 నెలలు మాత్రమే జెడ్పీ సమయం ఉంది. ప్రస్తుతం శారదను వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. అయితే జిల్లాలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రం.. తమకే వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ పై ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు జెడ్పీ చైర్మన్ నియామకం జీవో విడుదల కాలేదు. దీంతో వైసీపీలోని రామయ్య వర్గం చైర్మన్ సీటు కోసం జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి దగ్గర పంచాయతీ పెట్టారు. అటు ఆకేపాటి, ఇటు రామయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్