గత కొన్ని రోజులుగా.. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ విషయంలో పోలీసులు సీరియస్ గా ఉన్నారు. తాజాగా దీనిపై పలువురు ప్రముఖులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా సినీ ప్రముఖులు రానా దగ్గుపాటి.. పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక టాలీవుడ్ లో చాలామందితో యాప్ నిర్వాహకులు ప్రమోషన్స్ చేయించారు. హీరో రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లపై కేసు నమోదు చేసారు పోలీసులు.
Also Read : దొంగల్లా వస్తున్నారు.. వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ సంచలనం
ఇక హీరోయిన్ నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, ప్రణీతలపై కూడా కేసు పెట్టారు. ఇక కొత్త నటులు అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయిని పావని సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి. అటు హైదరాబాద్ మెట్రో కి కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రో… బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన స్టిక్కర్స్ ను మెట్రో ట్రైన్ లో అతికించారు.
Also Read : జగన్ కోసం విజయసాయి కొత్త స్ట్రాటజీ..?
ఎక్స్ 1 అనే బెట్టింగ్ యాప్ ను హైదరాబాద్ మెట్రో ప్రమోట్ చేస్తుంది. గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ పై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో.. ఇటువంటి యాప్స్ ను ప్రమోట్ చేయవద్దని.. హైదరాబాద్ మెట్రో అధికారులకు సూచించారు పోలీసులు. ఇప్పటివరకు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసారు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో కూడా బెట్టింగ్ ప్రమోట్ చేయడంతో ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా బెట్టింగ్ యాప్స్ విషయంలో పోలీసులు సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు.