ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగని సంఘటనలు ఇప్పుడు మనం చూస్తున్నాం. సాధారణంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓడిపోవడం, వేరే పార్టీలు అధికారంలోకి వచ్చి తప్పులను సరి చేయడం లేదా నేరాలు చేసిన వాళ్ళ మీద దృష్టి పెట్టి అరెస్ట్ లు చేయడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు చూడటం వంటివి మనకు తెలిసిందే. కాని ఏపీలో ఇప్పుడు ఒక వింత సంస్కృతి మొదలయింది. తమ అక్రమాలకూ ఎలాంటి ఆధారాలు దొరక్కుండా కీలక ఫైళ్లను తగలబెట్టే కార్యక్రమం నిరంతరాయంగా సాగుతుంది.
వైసీపీ నేతలే స్వయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫైళ్ళలోని పత్రాలు బయటకి వస్తే వాళ్లకి ఇబ్బందులు తప్పవు కాబట్టి. పెద్దిరెడ్డి వ్యవహారమే దీనికి మరింత బలం చేకూర్చింది. ఫైల్స్ దొంగతనం చేయడం, లేదా వాటిని కాల్చడం వంటివి పదే పదే చేస్తున్నారు. పెద్దిరెడ్డి వ్యవహారంలో సర్కార్ చాలా సీరియస్ గా ఉంది. అయినా సరే ఈ సంఘటనలు మాత్రం ఆగలేదు. డీజీపీ ఫోకస్ పెట్టి విచారణ చేయడం చూస్తున్నాం. ఆ కేసు సిబిఐ కి కూడా వెళ్ళింది. ఇప్పుడు మరో చోట ఈ ఫైల్స్ కాల్చేసే ఘటన చోటు చేసుకుంది. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ పరిపాలనా కార్యాలయంలో పలు ఫైల్స్ ను కాల్చేశారు.
ఎడమ కాలవ భూ సేకరణకు సంబంధించిన పత్రాలు ఇందులో ఉన్నాయని సమాచారం. లబ్దిదారుల పరిహారంలో అక్రమాలు బయటకు వస్తాయనే కారణంతో వీటిని కాల్చేసారని తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు అధికారుల పాత్ర కూడా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పోలవరం గురించి కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తుంది. మరి దీనిపై ఏ చర్యలు ఉంటాయో, ఇక్కడైనా అరెస్ట్ లు ఉంటాయో లేదో చూడాలి.