Monday, October 27, 2025 10:41 PM
Monday, October 27, 2025 10:41 PM
roots

వివేకా కేసులో మరో నిందితుడ్ని లేపెయడానికి ప్లాన్..?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఎప్పుడు క్లారిటీ వస్తుందా అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. 2019 ఎన్నికల సమయంలో జరిగిన ఈ ఘటన రాజకీయంగా ఎన్నో విమర్శలకు వేదికగా మారింది. ఈ కేసులో ముందు సిబిఐ విచారణ డిమాండ్ చేసిన వైసీపీ.. ఆ తర్వాత సిబిఐ విచారణ వద్దని కోర్ట్ కు వెళ్ళింది. కాని హైకోర్ట్ సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ కేసును కాస్త సీరియస్ గా తీసుకున్నట్టు గానే కనపడినా.. ఇప్పటి వరకు కేసు విచారణ మాత్రం కొలిక్కి రాలేదు.

Also Read : క్యాచ్ కాదు మ్యాచ్ వదిలేసాడు.. జైస్వాల్ ముంచేసాడా..?

చేసింది ఎవరు.. చేయించింది ఎవరు అనే క్లారిటీ ఉన్నా సరే చార్జ్ షీట్ మాత్రం దాఖలు కాకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని.. ప్రజల నుంచి ప్రశ్నలు వినపడుతున్నా.. కేసులో మాత్రం ముందుకు అడుగు పడటం లేదు. కాని.. కేసులో కీలకంగా ఉన్న సాక్షులు, నిందితులు మాత్రం వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. వాచ్మెన్ రంగయ్య కూడా ఈ కేసులో ప్రాణాలు కోల్పోయాడు. ఇక దస్తగిరి తనకు ప్రాణ హాని ఉందని పలు మార్లు ఆవేదన వ్యక్తం చేసాడు.

Also Read : ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్.. మా రియాక్షన్ కు రెడీగా ఉండు

ఇప్పుడు ఇదే కేసులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ అవినాష్‌రెడ్డి అనుచరులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసారు. వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్‌ను కారులో వెంబడించడంపై పోలీసు కేసు నమోదు చేసారు. సునీల్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అవినాష్ రెడ్డి పీఏ లోకేష్ రెడ్డి, సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్‌పై కేసు నమోదు చేసారు. పవన్ కుమార్ పై గతంలోనూ సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు ఓ కేసు నమోదు అయింది. బీఎన్‍ఎస్ చట్టం 351, 126 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్