వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయడంతో.. మిధున్ రెడ్డి తోపాటుగా వైసిపి నాయకత్వం కూడా ఆందోళనలో ఉంది. లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆయనపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా విదేశాలకు నగదు తరలించే విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే డిస్టిలరీలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి నకిలీ మద్యాన్ని పెద్ద ఎత్తున సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
Also Read : ఆ జెండా మాదే.. వదిలేది లేదు..!
చిత్తూరు జిల్లాలోనే నకిలీ బ్రాండ్ల తయారీ భారీగా జరిగిందని అప్పట్లో ఆరోపించింది టిడిపి. ఇక దీనిపై పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యల తర్వాత హీట్ పెరిగింది. దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విచారణ మొదలుపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. దీనితో మిధున్ రెడ్డి తనను తాను కాపాడుకోవడానికి ఏం చేస్తారనే దాని పైనే చర్చ జరుగుతుంది. ఇదే విషయం పై చిత్తూరు జిల్లాలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజలు కూడా అయన ఏమి చేస్తారు అని ఆసక్తిగా గమనిస్తున్నారు.
Also Read : మారని గోయెంకా తీరు.. నిన్న రాహుల్ నేడు పంత్
ఆయన వైసిపి నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్న పెద్దిరెడ్డి కుటుంబం.. ఇప్పుడు జగన్ కు దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. జగన్ కు అండగా నిలబడేకంటే.. తన తండ్రిని కాపాడుకునేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. బిజెపి తో సఖ్యతగా మెలిగేందుకు కూడా ఆయన ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొంతమంది ఆయన బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే రాయలసీమలో వైసిపికి పెద్ద దెబ్బ పడే అవకాశాలుంటాయి.
Also Read : ఎస్.. రెడ్ బుక్ కోసమే పోలీసులు పని చేస్తారు
అయితే ఆయన బిజెపిలో చేరతారు అని చాలా రోజుల నుంచి పుకార్లు వస్తున్నా, అవేమి నిజం కాదని బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో బిజెపి నాయకులు కూడా ఆయన్ను అధికారికంగా బిజెపిలో చేర్చుకుంటారు అనుకోవడం లేదని పరిశీలకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అనధికారికంగా బిజెపి పెద్దలకు, పెద్దిరెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైసీపీని ముందుండి నడిపిస్తుంది పెద్దిరెడ్డి కుటుంబం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా పెత్తనం పెద్ద ఎత్తున చలాయించారు. ఇక లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తన పేరు బయటకు రావడంతో ఏం చేయబోతున్నారనేదే వైసీపీలో టెన్షన్ టెన్షన్.