ఏపీలో మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. వరుసబెట్టి మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలను ఒక్కొక్కటిగా బయటకు లాగుతున్నారు. ఇప్పటి వరకు పేర్ని నానీ, కొడాలి నానీ, విడదల రజనీ, పెద్దిరెడ్డి, జోగి రమేష్ వంటి వారి అవినీతి వ్యవహారాలు, అధికారం అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలు బయటకు వచ్చాయి. ఇటీవల మాజీ మంత్రి విడదల రజనీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి.. 2 కోట్ల రూపాయలు తీసుకుందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై గవర్నర్ అనుమతితో ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసారు.
Also Read: ప్రత్యక్ష రాజకీయాల్లోకి భువనేశ్వరి..?
ఆ తర్వాత ఆమె రాజకీయంగా.. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలుపై చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. వాటికీ.. లావు కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. కేవలం రియాక్ట్ అవ్వడమే కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం గురించి పార్లమెంటులో చర్చను లేవదీసి, దాని పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసి పూర్తి సమాచారం అందచేసారు. ఇక ఇప్పుడు కొడాలి నానీ, పెద్దిరెడ్డి వ్యవహారాలూ సంచలనం అవుతున్నాయి. కొడాలి నానీ అనారోగ్యంతో ఆస్పత్రిలో జాయిన్ కాగా.. ఇప్పుడు పెద్దిరెడ్డి కూడా ఆస్పత్రిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్ళుగా ఆయన వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం సాక్ష్యాలు బయట పెడుతూ వచ్చింది. అటవీ భూములను ఆక్రమించారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి.
Also Read: వివేకా హత్య కేసు.. ఇంతకీ అజ్ఞాత వ్యక్తి ఎవరు..?
ఇక మరికొద్ది రోజుల్లో ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తల నేపధ్యంలో.. తాజాగా పెద్దిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ఈ రోజు ఉదయం ఆయన ఇంట్లో జారి పడటంతో ఫ్రాక్చర్ అవ్వగా చేతికి ఆపరేషన్ కూడా నిర్వహించారు అని తెలుస్తుంది. ఆయన మద్యం మత్తులో కింద పడినట్టు ప్రచారం జరుగుతున్నా అందులో ఎంత నిజం ఉందనే విషయం బయటకి రాలేదు. అయితే త్వరలో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఒత్తిడికి లోనైన పెద్దిరెడ్డి.. మద్యానికి బానిస అయ్యారని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు వైరల్ గా మారాయి. మరి పెద్దిరెడ్డి విషయంలో వాస్తవాలు ఏంటీ అనేది చూడాలి. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలతో వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది అని చెప్పుకోవాలి.