Wednesday, February 4, 2026 02:33 PM
Wednesday, February 4, 2026 02:33 PM

లోకేష్‌కు ఎంపీ సవాల్. అలా చేయగలవా..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. ఇటీవల తిరుమలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా విపరీతమైన పబ్లిసిటీ వస్తోంది. నిత్యం లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం మొదలు.. పరకామణి చోరీ కేసు, ఇటీవల గోవిందరాజ స్వామి ఆలయ బంగారు తాపడంలో 50 కేజీల బంగారం చోరీ అయినట్లు కూడా టీటీడీ గుర్తించింది. దీనిపై ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో పరిస్థితులపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేసిన వీడియో పెద్ద వైరల్‌గా మారింది.

Also Read : అమరావతికే కుచ్చు టోపీ పెడుతున్న బినామీ ఏజెన్సీలు..!

తిరుమల పవిత్రతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. భక్తులకు అవసరమైన సౌకర్యాలతో పాటు పారిశుధ్యం కోసం కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్‌కు వచ్చిన భక్తులు.. స్వామి వారి దర్శనం అనంతరం తిరిగి స్వగ్రామాలకు వెళ్లే వరకు వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు టీటీడీ చేస్తోంది. కొండపైకి వచ్చే భక్తులకు కాలి నడక మార్గం, కొండపైన ఉచిత రవాణ, అన్న ప్రసాదం, స్వామి వారి దర్శనం, వసతి, వైద్యం వంటి ఎన్నో సౌకర్యాలు భక్తులకు టీటీడీ అందిస్తోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వచ్చే భక్తులకు శీఘ్ర దర్శనం అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది.

అయితే తిరుమల కాలి నడక మార్గంలో పరిస్థితులపై ఓ ఎంపీ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాలి నడక మార్గంలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణలోని పెద్దపల్లి లోక్‌సభ సభ్యులు గడ్డం వంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన తాత గడ్డం వెంకటస్వామి వర్థంతి సందర్భంగా కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు గడ్డం వంశీ కృష్ణ. కాలినడకన కొండకు వచ్చిన వంశీ కృష్ణ అక్కడి పరిస్థితులు తనను తీవ్ర ఆందోళనకు గురి చేశాయంటూ వీడియో రిలీజ్ చేశారు. తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో ఆ వీడియో పోస్ట్ చేశారు.

Also Read : జగన్ దెబ్బ.. పీపీపీలో కాంట్రాక్టర్ల కు భయం మొదలు

నారా లోకేష్ కు నేను బహిరంగ సవాలు విసురుతున్నాను.. అంటూ వ్యాఖ్యానించిన గడ్డం వంశీ కృష్ణ.. భక్తితో కొండలు ఎక్కుతున్నప్పుడు, తాను గమనించిన పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. కనీసం ఒక్కసారైనా, సెవెన్ హిల్స్ ఫుట్‌పాత్‌లో కాలినడకన నడిచి, నేడు దాని దయనీయ స్థితిని స్వయంగా గమనించండి అంటూ లోకేష్‌కు సూచించారు. ఈ మార్గం భయంకరమైన స్థాయికి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్మాణ శిధిలాలు దారి పొడవునా చెల్లాచెదురుగా ఉన్నాయని.. టాయిలెట్ “ఇన్నోవేషన్స్” అని పిలవబడేవి, మార్గంలో ఉంచబడిన కమోడ్‌లు, మెట్ల మధ్య ఏర్పాటు చేయబడిన స్టీల్ ట్రేలు నడకకు చాలా ఇబ్బందిగా, కష్టంగా, ప్రమాదకరంగా మార్చాయన్నారు. వీటి వల్ల భక్తుల గాయాలకు గురవుతున్నారన్నారు ఎంపీ వంశీకృష్ణ.

ప్రాథమిక ప్రథమ చికిత్స కేంద్రాలు కూడా ఎక్కడా అందుబాటులో లేవని.. మోకాళ్ల పర్వతం సహా.. కొన్ని చోట్ల భక్తులు బస్సులు, కార్ల మధ్య రోడ్లు దాటుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందన్నారు. భక్తుల భద్రత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై లోకేష్ వెంటనే స్పందించాలన్నారు. అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని లోకేష్‌ను కోరారు. తిరుమల నడక మార్గంలో ఎటువంటి ఆలస్యం లేకుండా అత్యవసరంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్