Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

పవన్ జోక్యం చేసుకున్నా.. రాని కుంకీ ఏనుగులు…!

ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఏనుగుల ప్రభావం తగ్గటం లేదు. అడవుల్లో నుంచి పొలాల్లోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత గ్రామాల్లోకి అడుగుపెట్టి చివరకు మనుషుల ప్రాణాలు కూడా తీయడం ఇప్పుడు సంచలనం అవుతుంది. తాజాగా చిత్తూరు జిల్లాలో రాకేష్ చౌదరి అనే ఒక ఉప సర్పంచ్ ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత దారుణంగా ఏనుగులు అతని ప్రాణాలు తీయడం అధికారులను కూడా భయపెడుతోంది. ఏనుగులు వచ్చాయని సమాచారం అందుకున్న రాకేష్ గ్రామస్తులతో కలిసి వాటిని తరిమేందుకు ప్రయత్నం చేశాడు.

Also Read : కొల్లేరు ప్రక్షాళన సాధ్యమేనా..?

ఈ క్రమంలో ఎదురు తిరిగిన ఏనుగులు అతన్ని అత్యంత పాసవికంగా చంపడం చూసి అక్కడి స్థానికులు అటవీ శాఖ అధికారులు కూడా భయపడిపోయారు. అటు ఉత్తరాంధ్రలో కూడా పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. పంట పొలాలను పెద్ద ఎత్తున ఏనుగులు నాశనం చేస్తున్నాయని అక్కడి స్థానికులు వాపోతున్నారు అయితే ఏనుగులను తరిమేందుకు కర్ణాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒప్పందం చేసుకుంది. కర్ణాటకలో కుంకి ఏనుగులు 40 గా అందులో నాలుగు ఏనుగులను ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు.

స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల ప్రాజెక్టును భుజానికి ఎత్తుకున్నారు. అయినా సరే కుంకీ ఏనుగుల సమస్య పరిష్కారం కాలేదు. కుంకి ఏనుగుల ప్రాజెక్టు ఇప్పటివరకు కార్యరూపం దాల్చకపోవడంతో ఏనుగులు చెలరేగిపోతున్నాయి. ప్రతిపాదన దశలోనే ఎలిఫెంట్ పార్కు కూడా ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే కర్ణాటక సర్కార్ తో ఎంవోయూ కూడా పూర్తి చేసుకున్న ఏపీ ప్రభుత్వం అటవీ శాఖ అధికారులకు నెలరోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చింది.

Also Read : జనాభా పెరగాలి.. నేషనల్ మీడియాలో చంద్రబాబు కామెంట్స్ వైరల్..!

గత పది ఏళ్లలో ఏనుగుల దాడులకు దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జనావాసాల్లోకి వచ్చి 27 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. మొత్తం 7,200 ఎకరాల్లో ఆరు కోట్లకు పైగా విలువ చేసే పంట నష్టం జరిగింది. రాత్రి వేళల్లో ఎక్కువగా గ్రామాల్లోకి చొరబడే ఏనుగులు… ఒడిశా తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కువగా రాష్ట్రంలోకి అడుగు పెడుతున్నాయి. మరి కుంకీ ఏనుగుల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువేళ్తుందా అలాగే వదిలేస్తుందా అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్