Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

కోడెలకు మద్దతుగా పవన్ కళ్యాణ్

సరస్వతి పవర్ భూముల పరిశీలన కోసం పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేసారు. ఈ రోజున మన ప్రభుత్వం రాకుంటే, వీరి దోపిడీకి అడ్డుకట్ట పడేది కాదన్నారు పవన్. కట్టని సిమెంట్ కంపెనీ ఫ్యాక్టరీకి వీళ్ళు 190 కోట్ల లీటర్ల పైన నీరు రాసేసుకున్నారని… 400 ఎకరాలు అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేసి దోచేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించారు. బాంబు దాడులు చేసి భూములు లాక్కున్నారని ఆయన ఆరోపించారు.

Also read : భారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ లు అవసరం లేదా..?

384 ఎకరాల భూములు కొన్నారని 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉందన్నారు. దళితుల భూమి తీసుకున్నారని పవన్ ఆరోపించారు. రైతులు ఇష్టపూర్తిగా భూములివ్వలేదన్నారు పవన్. జగన్ సిఎం గా ఉన్నప్పుడు యాభై ఏళ్ళకు లీజు తీసుకున్నారని ఫ్యాక్టరీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇప్పుడున్న యువతను భయపెట్టారన్నారు. 700 ఎకరాల భూమి మాచవరం, దాచేపల్లి మండలాల్లో స్వంత ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారన్నారు పవన్. రైతులకు వారి పిల్లలకు ఉద్యోలిస్తామని భూములు తీసుకున్నారని… రాష్ట్ర సమస్య ఇదని పవన్ ఆందోళన వ్యక్తం చేసారు.

Also read : నీ సేవలు చాలు.. అరబిందోకి బాబు షాక్

గతంలో పెట్రోల్ బాంబులు నాటు బాంబులు వేసి భయపెట్టారన్నారు పవన్. ఇంత పెద్ద ఎత్తున భూములు దోచుకుని కొన్ని లక్షల విలువ చేసే ఫర్నీచర్ కోసం కోడెల శివప్రసాద్ గారిని ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసారని పవన్ మండిపడ్డారు. గత ప్రభుత్వం కారణంగా పోలీసులు భయపడ్డారు లేదంటే మెత్తబడ్డారన్నారు పవన్. రౌడీయిజాన్ని అరికట్టాలని పోలీసులను ఆదేశించారు. ఇంకా వైసిపి ప్రభుత్వం ఉన్నట్లు భావిస్తున్నారన్నారు. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉందో చేసి చూపిస్తామని స్పష్టం చేసారు. తోలు తీస్తాం, తొక్క తీస్తాం అంటూ హెచ్చరించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్