వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తన భార్య భారతీ కోసం వైఎస్ జగన్ రిషికొండలో అప్పట్లో ప్యాలెస్ నిర్మించారని టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. అందమైన పర్యాటక కేంద్రంగా ఉన్న రిషికొండను తవ్వి, ప్యాలెస్ కట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పర్యావరణ శాఖ కూడా ఈ విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించింది. ఇక శాటిలైట్ కెమెరాల్లో కనపడకుండా గ్రీన్ మ్యాట్ కూడా కట్టడం అప్పట్లో ఓ సంచలనం అనే చెప్పాలి.
Also Read : మరో అవకాశం ఇచ్చినట్లేనా..?
విశాఖ రాజధాని అని, అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం అని అప్పట్లో వైసీపీ నేతలు వాదించారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం అది కేవలం.. రాష్ట్రపతి, సుప్రీం కోర్ట్ జడ్జీలు వచ్చినప్పుడు అధికారికగా వసతి గృహంగా చెప్పారు. అందులో వాడిన గృహోపకరణాలు, ఫర్నీచర్ అన్నీ విమర్శలకు దారి తీసాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఏం చేయాలో అర్ధం కాక, ప్రభుత్వం అలా వదిలేసింది. తాజాగా డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన మంత్రులు రిషికొండ ప్యాలెస్ ను పరిశీలించారు.
Also Read : ఏ క్షణమైనా పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్.. షాక్ ఇచ్చిన హైకోర్ట్
ఈ సందర్భంగా ప్యాలెస్ నిర్మాణంలో లోపాలు ఆశ్చర్యపరిచాయి. ఊడిపడుతున్న ప్యాలెస్ ఫాల్ సీలింగ్ చూసి పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు. పైకప్పు లోపాలతో లోపలికి వర్షం నీరు దిగుతుందని వీడియోలతో సహా చూపించారు. ప్యాలెస్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్, మరో రెండు గదుల్లో ఫాల్ సీలింగ్ షీట్లు ఊడిపడ్డాయి. నీటి లీకేజీ వల్ల ఫాల్ సీలింగ్ తడుస్తూ ఊదిపోతోంది. మరమ్మత్తు చేయకపోతే మొత్తం ఫాల్ సీలింగ్ దెబ్బతినే అవకాశం ఉన్నట్టు అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. బాత్ రూమ్ లో కూడా లీకేజ్ ఉన్నట్టు తేల్చారు. ఇలా ప్యాలెస్ లో మొత్తం లోపాలు ఉన్నాయని పవన్ పర్యటనతో స్పష్టమైంది.