Saturday, September 13, 2025 03:21 AM
Saturday, September 13, 2025 03:21 AM
roots

జగన్ టార్గెట్ గా పవన్ ప్లాన్.. అలెర్ట్ అయిన కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైసీపీని దెబ్బకొట్టడమే కూటమి లక్ష్యం. రాజకీయంగా తమకు చుక్కలు చూపించిన జగన్ ను ఎలా అయినా సరే అధఃపాతాళానికి తొక్కాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలకు పెద్ద ఎత్తున పవన్ గాలం వేస్తున్నారు. ఇక పవన్ ను నమ్మి వస్తున్నారో… లేదంటే కూటమికి భయపడి వస్తున్నారో తెలియదు గాని ఎక్కువమంది నేతలు పవన్ ను కలిసి జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉండగా తాము చేసిన అరాచకాలని గుర్తు చేసుకుని, చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం చూసి, జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక్కడి వరకు బాగానే ఉంది గాని… ఇక్కడ కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఏంటీ అనేది జగన్ కు అర్ధం కావడం లేదు. కూటమిలోకి నేతలు వెళ్ళడం వరకు ఓకే గాని… కొందరు వైసీపీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరికి కాంగ్రెస్ పక్కాగా గాలం వేసింది అనే వార్తలు వస్తున్నాయి. బలమైన నాయకత్వం మొత్తం జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేయడంతో… కాంగ్రెస్ కూడా అలెర్ట్ అయింది.

Read Also : ఇప్పుడెలా.. ఏం చేద్దాం..? ఆందోళనలో జగన్

అందుకే ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకత్వానికి గాలం వేయడం మొదలుపెట్టింది. అందులో అనంతపురం జిల్లాకు చెందిన ఒక యువ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఆయన జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ వెంటనే రంగంలోకి దిగి తన రాజకీయం తాను చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేతకు… మీ మీద కేసులు ఉంటే మేము అండగా నిలుస్తాం కాంగ్రెస్ లో చేరండి అనే భరోసా ఇచ్చింది. అయితే కాంగ్రెస్ లో చేరినా వైసీపీలో ఉన్నా ఒకటే అని భావిస్తున్నారో తెలియదు గాని కొందరు వెనకడుగు వేస్తున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఇద్దరు త్వరలోనే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్