Tuesday, October 28, 2025 05:23 AM
Tuesday, October 28, 2025 05:23 AM
roots

మళ్లీ ఎలా గెలుస్తావో నేను చూస్తా..!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరో మూడేళ్లల్లో ఎన్నికలు వస్తాయి.. అప్పుడు ప్రజలు తనకు మళ్లీ అధికారం ఇస్తారని పదే పదే చెప్తున్నారు జగన్. ఈ వ్యాఖ్యలపై పవన్ ధీటుగా బదులిచ్చారు. 2029లో వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో మేమూ చూస్తాం అన్నారు. అధికారంలోకి వస్తే కేసులు పెడతాం.. సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు… వైసీపీ ఐదేళ్ల పాలనలో అరాచకాలు ఎదుర్కున్న తర్వాతే ఇక్కడి వరకు చేరుకున్నామన్నారు పవన్ కల్యాణ్. తాను 2 చోట్ల ఓడినా తర్వాతే.. మరింత రాటుదేలినట్లు పవన్ స్పష్టం చేశారు.

Also Read : తిరుపతిలో భయపెడుతున్న గంజాయి గ్యాంగ్ లు..

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటించారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద 1290 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులను 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేసే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు. ఈ పనులను తాను స్వయంగా పర్యవేక్షిస్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఆపేస్తున్నట్లు కేంద్రం తనతో చెప్పిందన్నారు. అయితే వైసీపీ ఐదేళ్ల సమయంలో ఏపీకి 26 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని.. కానీ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగానే కేవలం 4 వేల కోట్లు మాత్రమే ఇచ్చినట్లు పవన్ తెలిపారు. ఆ డబ్బులను కూడా వైసీపీ సర్కార్ వృధా చేసిందన్నారు.

Also Read : తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న మెడికల్ కాలేజ్ స్కాం

వైసీపీ నేతలపైన పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు పవన్. ఓడిపోతామని తెలిసిన తర్వాతే సరిగ్గా ఎన్నికల ముందు వెలుగొండ ప్రాజెక్టు పేరుతో శిలాఫలకం ఆవిష్కరించారన్నారు. పథకం పూర్తి చేయకుండా ప్రారంభోత్సవాలు చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం తప్పు చేస్తే సరి చేయాలని సూచించారు. అంతే తప్ప రెచ్చగొడితే మాత్రం గతంలో కంటే ఇంకా గట్టిగా పని చేస్తామన్నారు పవన్. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్న పవన్.. రంపాలు తెస్తామంటే చూస్తూ ఉంటామా అని ఆగ్రహం వ్యక్తం చేారు. మెడకాయలు కోస్తామంటే.. చొక్కాలిప్పుకుని రెడీగా ఉన్నామనుకున్నారా అని పవన్ ఫైర్ అయ్యారు. సినిమా డైలాగులు సరదాగా ఉంటాయని.. అద్భుతమైన పాలన చేసి ఉంటే.. 151 స్థానాల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయారని నిలదీశారు. తమది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదని.. తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం అని వెల్లడించారు.

Also Read : బరిలో టీడీపీ.. కాంగ్రెస్ కు షాక్ తప్పదా..?

15 ఏళ్ల పాటు కూటమి ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని వేళ్లు ఒకేలా ఉండని.. కానీ అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందామన్నారు. అదే సమయంలో కొత్తగా పార్టీలోకి వస్తున్న వారి గురించి కామెంట్ చేశారు. కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొన్ని సమస్యలుంటాయని.. సర్దుకుపోవాలని సూచించారు. తనకు ఎవరితో వ్యక్తిగత విరోధం లేదన్నారు. గత ముఖ్యమంత్రితో కూడా తనకు వ్యక్తిగత విరోధం లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తారు.. రెచ్చిపోవద్దని హితవు పలికారు.

Also Read : టీం ఇండియా అండర్ రేటెడ్ క్రికెటర్

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వైసీపీలో ఉన్నప్పటికీ.. తనకు ఎంతో సాయం చేశారన్నారు. చాలా సందర్భాల్లో తనకు బాలినేని అండగా ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. రాజకీయం చేయడం తెలిసిన వ్యక్తి బాలినేని అని.. అందుకే ఆయనను పార్టీలో చేర్చుకున్నట్లు పవన్ స్పష్టం చేశారు. అయితే ఈ పర్యటనలో మార్కాపురం జిల్లాపై పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎన్నికలకు ముందే మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ ఉంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కూడా మార్కాపురం ప్రత్యేక జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ సభలో పవన్ కనీసం ఆ ఊసే ఎత్తలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్