Saturday, September 13, 2025 09:10 AM
Saturday, September 13, 2025 09:10 AM
roots

చిత్ర పరిశ్రమకు పవన్ హెచ్చరిక

కొన్ని సున్నితమైన విషయాలు ఉంటాయి… ఆ విషయాల్లో నోటి దూల ఎంత తక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. నవ్వుతున్నారు కదా అని ఎక్కువ నవ్విస్తే నవ్వుల పాలు కావడం ఖాయం. ఇవి సినిమా వాళ్లకు బాగా వర్తిస్తాయి. బుద్ధి మంచిది అయినా నోరు మంచిది కాకపోతే రచ్చ రచ్చ అవ్వడం ఖాయం. ఇప్పుడు తమిళ స్టార్ హీరో కార్తి విషయంలో అదే జరిగింది. తిరుమల లడ్డు విషయంలో తీవ్ర దుమారం రేగుతోంది. దేశ వ్యాప్తంగా అది ఓ మతం మీద జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారు. అలాంటి వ్యవహారం విషయంలో జోకులు వేస్తే జోకర్ అయిపోవడమే.

తమిళ హీరో కార్తి సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో తిరుమల లడ్డు వ్యవహారంపై స్పందించాల్సి వచ్చింది. ఒక సినిమా కార్యక్రమంలో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు, ఇది సున్నితమైన అంశం.. దీని గురించి మాట్లాడకపోవడం మంచిది అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సినిమా వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దీనితో వెంటనే హీరో కార్తి క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలు అపార్ధం చేసుకున్నారని వాటికి క్షమాపణలు కోరుతున్నాను అన్నారు. ఇక ఆయన సోదరుడు హీరో సూర్య కూడా క్షమాపణలు చెప్పారు. తన తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నా అని, తాను కూడా పవన్ కు సంఘీభావంగా దీక్ష చేస్తానని అన్నారు.

Read Also : సస్పెండ్ కాదు..వాళ్ళందరూ అరెస్ట్ ఖాయం

దీనిపై సర్వత్రా ప్రశంశలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం దెబ్బకు టాలీవుడ్ కూడా సెట్ అయిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. గతంలో కొందరు సినిమా పరిశ్రమలోనే రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అనవసరమైన విషయాల్లో తల దూర్చిన హీరోలు కూడా ఉన్నారు. వారికి కూడా పవన్ కళ్యాణ్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. సినిమా కార్యక్రమాల్లో, టీవీ షోస్ లో జోకులు వేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో మాదిరిగా చంద్రబాబు సర్కార్ సైలెంట్ గా ఉండే అవకాశం లేదని పవన్ కళ్యాణ్ నుంచి క్లారిటీ వచ్చింది. దీనితో టాలీవుడ్ సెట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు సోషల్ మీడియా జనాలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్