Tuesday, October 28, 2025 04:49 AM
Tuesday, October 28, 2025 04:49 AM
roots

ఒక్కడ్ని కూడా వదలను.. పవన్ వార్నింగ్

కడప జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అధికారులపై దాడి చేయడం వైసిపికి కొత్త కాదని ఇది వైసిపి రాజ్యం అనుకుంటున్నారని మండిపడ్డారు. జవహర్ బాబు ను అమానుషంగా కొట్టారని జవహర్ బాబు కు హైబీపీ తో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వం లా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇష్టా రాజ్యంగా అధికారులు దాడి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఘటనా స్థలానికి సిఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు.

Also Read : ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ఖరారైతే తిరుగులేదు

అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోపెడతామని హెచ్చరించారు. అహంకారం తో కళ్ళు నెత్తికెక్కాయని…ఇది కూటమి ప్రభుత్వం వైసిపి కాదని… ఎలా నియంత్రించాలో తెలుసు చేసి చూపిస్తామని స్పష్టం చేసారు. ఎస్సీ ఎస్టీ అని కాదు ఎవరైనా సరే ఆధిపత్య దోరణిలో ఎవరి మీద చేసినా ఇలాగే స్పందిస్తానని పరారిలో ఉన్నా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని మీరు అయినా ఎవరు రక్షించలేరన్నారు. రాయలసీమ లో మహిళల ఎవరు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. 11 సిట్లు వచ్చినా వారి అహంకారం తగ్గలేదన్నారు.

Also Read : పవన్ తో భేటీ.. టాలీవుడ్‌లో టెన్షన్..!

కూటమి నాయకులు కూడా దైర్యంగ ఎదుర్కోవాలని జవహర్ బాబును భయపెట్టి చంపుతాం అని బెదిరించారన్నారు. ఇలాంటి నాయకులు ఎన్నికల్లో పాల్గొనాలి అంటే భయం రావాలన్నారు పవన్. జవహర్ బాబు కుటుంబానికి భరోసా ఇస్తున్నా అన్నారు. ఒక మండలానికి అధికారిని కులం పేరుతో దూషించడం పరిపాటి అయిపోయిందని ఇలాంటి దాడుల పై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను అన్నారు. ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. రైతు కుటుంబం ఆత్మహత్య పై విచారణ జరుగుతోందన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్