Thursday, September 11, 2025 11:20 PM
Thursday, September 11, 2025 11:20 PM
roots

తమిళనాడు పై పవన్ గురి..?

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో బలపడేందుకు తమిళనాడు అత్యంత కీలకం కావడంతో బిజెపి చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తోంది. ఇప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న నాయకులను తమిళనాడులో ప్రయోగించాలని బిజెపి అడుగులు వేస్తోంది. తమిళనాడులో పలువురు స్టార్ హీరోలను కూడా భారతీయ జనతా పార్టీ ఈ మధ్యకాలంలో సంప్రదించినట్లు ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ఇతర భాషలపై కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఇప్పటికైనా కలిసి పని చేస్తారా.. లేదా..?

తమిళనాడులో బలంగా ఉన్న హిందుత్వ ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి నాయకులు తీవ్రంగా కష్టపడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా తమిళనాడు ఎన్నికల్లో ఉపయోగపడే అవకాశం ఉండటంతో బిజెపి జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తమిళనాడులో హిందుత్వ ఓటు బ్యాంకు పై దృష్టిపెట్టారు. జనసేన పార్టీని కూడా యాక్టివేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు ఉన్నాయి. ఇప్పుడు అన్న డిఎంకె నీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాారనే వార్తలు చూస్తున్నాం.

Also Read :ఇలా తయారయ్యా రేంట్రా బాబు మీరు..!

ఇక తమిళనాడులో పవన్ కళ్యాణ్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బిజెపి జాగ్రత్తపడుతోంది. అక్కడ స్థిరపడిన కాపు నాయుడు ఓటు బ్యాంకు ను పవన్ కళ్యాణ్ ద్వారా టార్గెట్ చేసేందుకు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కోయంబత్తూర్, మధురై, తిరుపూర్, చెన్నై సహా కొన్ని ప్రాంతాల్లో కాపు నాయుడు ఓటు బ్యాంకు బలంగా ఉంది. అలాగే చిత్తూరు, నెల్లూరు జిల్లాలో సరిహద్దుల్లో కూడా ఈ ఓటు బ్యాంకు బలంగా ఉంది. దీనితో పవన్ కళ్యాణ్ అయితే తమకు లాభం ఉంటుందని బిజెపి భావిస్తోంది. ఆటు తెలుగుదేశం పార్టీ కూడా తమిళనాడులో కాస్త కార్యకర్తలను కలిగు ఉంది దీనితో పవన్ కళ్యాణ్ ను కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ముందుగానే పంపించేందుకు బిజెపి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అటు తెలుగుదేశం పార్టీకి కూడా తమిళనాడులో మంచి ఓటు బ్యాంకు ఉంది. వీటిని తమ వైపుకు తిప్పుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని బిజెపి నాయకత్వం ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

అనిమిని దెబ్బకు సైలెంట్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి ఆర్కే...

పోల్స్