ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెట్టారు. రాబోయే రెండు మూడు నెలలు సినిమాలను కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలకు వర్క్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేయాలని కమిట్మెంట్తో ఉన్నట్టు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో హరిహర వీరమల్లు అనే సినిమాను పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరో వారం రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా కంప్లీట్ అయిపోతుంది. దాదాపు మూడు నాలుగేళ్ల నుంచి ఈ సినిమా కోసం పనిచేస్తూనే ఉన్నారు.
అయితే రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు పరిపాలనలో కాస్త గ్యాప్ రావడంతో సినిమాలను ఫినిష్ చేయాలని డైరెక్టర్లకు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సినీ వర్గాలు ఉంటున్నాయి. అందుకే త్వరలోనే సుజిత్ డైరెక్షన్లో చేసే ఓ జి సినిమాని కూడా మొదలుపెట్టి మూడు నాలుగు నెలల్లో ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి పవన్ పట్టుదలగా ఉన్నారు. ఆ సినిమా కోసం ఫాన్స్ ఎదురు చూడటంతో దసరా నాటికి ఎలాగైనా రిలీజ్ చేయాలని నిర్మాతలు కూడా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు బిజీగా ఉంటారనేది చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే పవన్ సినిమాలపై నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టి ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా ఆలస్యమైతే నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సినిమాలను వేగంగా ఫినిష్ చేసేందుకు పవన్ ను ఒప్పించారు. నిర్మాతల కష్టాలు అలాగే అటు అభిమానుల కోరికను అర్థం చేసుకున్న పవన్ రాబోయే రెండు మూడు నెలల్లో ఎక్కువ సమయం సినిమాలకు కేటాయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కి కూడా ఇబ్బందులేకుండా మంగళగిరి సమీపంలోనే సెట్ వేసి అక్కడే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. ఓ జి సినిమా షూటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ లోనే జరిగే ఛాన్స్ ఉంది. కొన్ని సీన్స్ మాత్రం ఉత్తరప్రదేశ్లో షూట్ చేయాల్సి ఉందట. దానికి ఫిబ్రవరిలో పవన్ డేట్స్ ఇచ్చేశారు.