Saturday, September 13, 2025 05:12 AM
Saturday, September 13, 2025 05:12 AM
roots

ముందు ఎమ్మెల్సీ.. తర్వాతే మంత్రి : పవన్ కళ్యాణ్

నాగ బాబు కు మంత్రి పదవిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. నేడు మీడియాతో మాట్లాడిన పవన్ పలు కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నారు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోనని స్పష్టం చేసారు. అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారని గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు వేయలేదన్నారు.

Also Read : బాలయ్య కోసం ఎన్టీఆర్.. నాగ వంశీ ప్లానింగ్

అందుకే ఇక్కడ అన్నింటినీ పక్కన పెట్టీ ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నానని తెలిపారు. బీసీ, ఎస్ సీ ఎస్టి లు అధికార, ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారని నేను బలమైన పార్టీ గా మారేదాక నాకు ఆ వర్గాల నుంచి మద్దతు దొరకడం కష్టమని అన్నారు. నాగబాబు కు నా సోదరుడి గా కేబినెట్ లో అవకాశం ఇవ్వడం లేదని నాతో సమానంగా పనిచేసారు, నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చే వాడిని అని ఆయన స్పష్టం చేసారు.

Also Read : గరికపాటికి రేవంత్ కీలక పదవి…!

కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదని నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్ సీ, బీసీ నేత నాతో కలిసి చేసి ఉంటే వాళ్ళకే ఇచ్చే వాడిని అన్నారు. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళను వారసత్వం గా చూడలేమని స్పష్టం చేసారు. మొదట ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్ లోకి నాగబాబు అని స్పష్టం చేసారు. మార్చ్ లో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు అని తెలిపారు. కొన్నిసార్లు మధ్యవర్తులు చెప్పే సమస్య లు వేరు అని క్షేత్ర స్థాయిలో నేరుగా పరిశీలన చేస్తే తెలుసుకునే సమస్యలు వేరు అన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్