అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు నుంచి కలిసి పని చేసిన ఈ ఇద్దరి మధ్య ఇటీవల ఓ విషయంలో విభేదాలు వచ్చాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ లో సైతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇద్దరి మధ్య బంధం మళ్ళీ బలపడే అవకాశాలు కనపడుతున్నాయి. వలస దారుల విషయంలో కాలిఫోర్నియాలో జరుగుతున్న దాడుల నేపధ్యంలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
Also Read : భారతీ మేడం.. సారి.. తప్పైంది.. మన్నించండి ప్లీజ్..!
లాస్ ఏంజిల్స్ లో వలసదారుల నిరసనలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ను సోమవారం ఎలాన్ మస్క్ సమర్ధించారు. అమెరికా విధిస్తున్న సుంకాల బిల్లులపై.. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ పోస్ట్ లో, ట్రంప్ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, పత్రాలు లేని వలసదారులపై తన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇటీవల హింస చెలరేగిన సంగతి తెలిసిందే.
Also Read : చినాబ్ వంతెనలో తెలుగు మహిళ కృషి.. ప్రముఖుల ప్రశంసలు
పరిస్థితిని హ్యాండిల్ చేసే విషయంలో ఇద్దరూ వెనుకబడ్డారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ ఇద్దరూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో దూకుడుగా వ్యవహరించే ట్రంప్, మస్క్ ఇద్దరూ ఇటీవల కాస్త హడావుడి చేసారు. నాసా నుంచి తన స్పేస్ ఎక్స్ క్యాప్సుల్ ను ఉప సంహరించుకుంటున్నా అని మస్క్ ప్రకటించారు. ఆ తర్వాత కాసేపటికే మళ్ళీ డ్రాగన్ కొనసాగుతుందని మస్క్ పేర్కొన్నారు. ట్రంప్ తో గొడవ తర్వాత టెస్లా షేర్ లు భారీగా నష్టాల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే.