టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా వార్ కనపడకుండా నడుస్తుంది. స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము రేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యంగ్ హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మోజులో పడ్డారు. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా సరే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తే పక్కాగా కలెక్షన్లు భారీగా వస్తాయని లెక్కలు వేస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తూ కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ మాత్రం పాన్ ఇండియా సినిమాల విషయంలో ఇబ్బంది పడుతోంది.
Also Read : కర్ణాటకలో గోరంట్ల మాధవ్.. రక్షణ కల్పిస్తోంది ఎవరూ…?
అల్లు అర్జున్ సంగతి పక్కన పెడితే మిగిలిన మెగా హీరోలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ కు ఇండియా వైడ్ గా క్రేజ్ వచ్చింది. గ్లోబల్ స్టార్ అనే టైటిల్ కూడా రామ్ చరణ్ కు ఫైనల్ చేశారు ఫ్యాన్స్. కానీ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు చేస్తున్న బుచ్చిబాబుతో సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా… సినిమాపై మాత్రం నమ్మకాలు తక్కువగానే ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి.
Also Read : మెగా ఫ్యాన్స్ కు మళ్ళీ వెయిటింగ్ తప్పదా…?
ఈ సినిమా కోసం సుకుమార్ బుచ్చిబాబు ఇద్దరు కష్టపడుతున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేశాడు రామ్ చరణ్. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా లైన్ లో ఉంది. అయితే ఈ రెండు మూడేళ్లు రామ్ చరణ్ ఎలా ప్రూవ్ చేసుకుంటాడనేది ఇప్పుడు మెగా అభిమానుల్లో ఉన్న ప్రశ్న. గేమ్ చేంజర్ సినిమా కోసం చాలా టైం తీసుకున్న రామ్ చరణ్… ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కాస్త డల్ అయిపోయాడు. ఇక బుచ్చిబాబుతో చేసె సినిమా పై అంచనాలు పెద్దగా లేవు అని చెప్పాలి. దానికి తోడు ఎన్టీఆర్ కోసం రాసిన కథను తనకోసం మార్పించుకున్నాడు రామ్ చరణ్. దీంతో ఆ కథలో ఎంత పట్టు ఉంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. వేరే హీరోల ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకుంటే రాంచరణ్ మాత్రం వెనకబడటాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.